ఎన్‌కౌంటర్ కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి : మహిళా సంఘాలు

ఎన్‌కౌంటర్ కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి : మహిళా సంఘాలు

వెటర్నరీ డాక్టర్ దిశ హత్యకేసులో ప్రధాన నిందితులైన నలుగురు మృగాలను శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం విదితమే… కాగా శుక్రవారం నాడు సాయంత్రమే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలని ఏర్పాట్లు అన్ని పూర్తి చేసుకున్నారు. అయితే ఈ నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని సవాల్ చేస్తూ, మహిళా సంఘాలు న్యాయస్థానానికి లేఖను రాశాయి. ఈమేరకు నిందితుల మృతదేహాలకు ఈనెల 9 వరకు కూడా అంత్యక్రియలు జరపకూడదని హైకోర్టు కీలక ఆదేశాలు జరీ చేసింది.

కాగా ప్రస్తుతానికి కస్టడీలో ఉన్నటువంటి నలుగురు నిందితులను ఎలా ఎన్‌కౌంటర్ చేస్తారని, పోలీసులు చట్టాన్ని ఎలా చేతిలోకి తీసుకుంటారని, సదరు లేఖలో మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాకుండా ఎన్‌కౌంటర్ కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజీపీకి ఆదేశాలు ఇవ్వాలని మహిళా సంఘాలు ఆ లేఖలో పేర్కొన్నాయి. ఇకపోతే ఆ నిందితుల డెడ్ బాడీలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేసి, దానిని వీడియో తీయాలని అందులో వెల్లడించారు. అయితే కొన్ని కారణాల వలన ఈకేసును సోమవారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది.