‘రేప్ చేస్తే ఉరితీస్తారా’ రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలని చెప్పిన పవన్ కళ్యాణ్

‘రేప్ చేస్తే ఉరితీస్తారా' రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలని చెప్పిన పవన్ కళ్యాణ్

దిశ ఎన్ కౌంటర్ నిందితులను పోలీసులు కాల్చి చంపడం పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. తెలంగాణ పోలీసుల చర్యను అందరూ సమర్థించారు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం వ్యతిరేకించారు.. ‘రేప్ చేస్తే ఉరితీస్తారా’ రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలని’ తీర్పు చెప్పారు. ఈ వ్యాఖ్యల పై తాజాగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కడిగి పారేశారు.

దత్తపుత్రుడు అంటూ పవన్ పై పరోక్షం గా సెటైర్లు వేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ ‘తన సోదరిని ఎవరో వేధిస్తే కత్తితో పొడవాలనిపించిందని చెప్పుకున్నాడు. పరాయి ఆడపిల్ల అయితే శిక్షల గురించి మరోలా మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి నీతులు చెబుతుండటం దురదృష్టం’ అంటూ పవన్ వైఖరిని తూర్పార పట్టారు.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను తప్పు పట్టిన పవన్ కళ్యాణ్ వైఖరి ఇప్పటికే దుమారం రేపింది. అందరూ హర్షించినా పవన్ మాత్రం తన కమ్యూనిజం భావాజాలంతో ఎన్ కౌంటర్ తప్పు అన్నాడు. తన సోదరిని వేధిస్తే కత్తితో పొడవాలనిపించిందని అప్పట్లో అన్న పవన్ ఇప్పుడు హైదరాబాద్ లో దిశను కాల్చిచంపిన నిందితుల పై కరుణ చూపడం వివాదానికి దారితీసింది. దీనిపైనే విజయ సాయిరెడ్డి తాజాగా జనసేనానిని కడిగి పారేశారు.