చనిపోయిన కార్మికుల కుటుంబాలని ఆదుకుంటాం : సీఎం కేసీఆర్

చనిపోయిన కార్మికుల కుటుంబాలని ఆదుకుంటాం : సీఎం కేసీఆర్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు దాదాపు గా 55 రోజుల పాటు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలనీ అలాగే మరికొన్ని డిమాండ్స్ తో సమ్మె లోకి వెళ్లారు. కానీ సమ్మె పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడంతో చాలామంది ఆర్టీసీ కార్మికులు ఆత్మ హత్యలకి పాల్పడ్డారు. అలాగే మధ్యలో ఆర్టీసీ కార్మికులకు రెండు సార్లు అవకాశం ఇచ్చిన సమ్మె ని విరమించలేదు. దీనితో ఆర్టీసీ కథ ఇక ముగిసింది. ప్రైవేట్ చేస్తాం అంటూ ప్రకటించడంతో  కార్మికులు ఆలోచనలో పడి ప్రభుత్వం దిగి రాకపోయేసరికి  సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు.

ఆ తరువాత కూడా వారిని విధుల్లోకి తీసుకోవడానికి సీఎం కేసీఆర్ కొంత సమయం తీసుకోని ఆ తరువాత ఎటువంటి షరతులు లేకుండా ఉద్యోగులందర్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంతోషం గా తమ తమ విధుల్లో జాయిన్ అయ్యారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించేందుకు వెంటనే రూ. 100 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. అంతే కాదు టికెట్ ధరలు పెంచుకునేందకు కూడా ఆర్టీసీ కి అనుమతిచ్చింది. అలాగే ఆ తరువాత ఆర్టీసీ కార్మికుల తో ప్రగతి భవన్ లో సమావేశం ఏర్పాటు చేసి ..వారితో మాట్లాడిన సమయంలో  సమ్మె చేసే సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలని ఆదుకుంటాం అని వారి కుటుంబంలో ఉన్న వారికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

అందులో భాగంగా తాజాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.సమ్మె సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సంబంధించిన 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో చని పోయిన 10 కుటుంబాల్లోని ఒక్కొక్కరి చొప్పున ఉద్యోగం కల్పించారు. ఒకరికి కండక్టర్గా అవకాశం కల్పించగా నలుగురికి జూనియర్ అసిస్టెంట్ ఐదుగురికి పోలీసు కానిస్టేబుళ్లు గా అవకాశం ఇచ్చారు.