టీడీపీలోకి కోట్ల రాక ఇక లాంఛనమే?

tdp-party-offer-for-kotla-s

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కర్నూలు జిల్లా రాజకీయాలు ఇక అధికార టీడీపీ కి ఏకపక్షంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా వుండాలని వైసీపీ నిర్ణయించడంతోటే ఆ పార్టీ జిల్లాలో ఏ పరిస్థితిలో వుందో అర్ధం అవుతోంది. ఇక టీడీపీ అభ్యర్థిగా కె.ఈ.ప్రభాకర్ ని నిర్ణయించడం ద్వారా అధినేత చంద్రబాబు జిల్లాలో వైసీపీ ఉనికిని ప్రశ్నించే ఇంకో పాచిక విసిరారు. నిజానికి ప్రభాకర్ ఈ మధ్య చంద్రబాబు మీద కొన్ని విమర్శలు కూడా చేసారు. అయినా చంద్రబాబు సంయమనంతో వ్యవహరించి ఆయనకే ఎమ్మెల్సీ పీఠం కట్టబెట్టడం వెనుక పెద్ద వ్యూహమే వుంది.

chandra-babu-naidu

కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం వుంది. రాజకీయంగా ఆ కుటుంబంతో విభేదించేవాళ్ళు సైతం వారిని గౌరవిస్తారు. అలాంటి కుటుంబంతో టీడీపీ లో కీలక పాత్ర పోషిస్తున్న కె.ఈ .కుటుంబానికి పడదు. విజయభాస్కర్ రెడ్డి హయాం నుంచే ఈ రెండు కుటుంబాలు రాజకీయ ప్రత్యర్ధులు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబాన్ని కూడా టీడీపీలోకి తీసుకురావాలని చంద్రబాబు ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నారు. అటు జగన్ వైపు నుంచి అదే ప్రయత్నం జరుగుతోంది . జగన్ వ్యవహారశైలి గురించి భయపడ్డ కోట్ల టీడీపీ వైపు ఆసక్తి చూపినా అక్కడ కె.ఈ సోదరుల హవా చూసి ఆయన ఆలోచనలో పడ్డారు. అయితే తాజాగా ప్రభాకర్ కి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా టీడీపీలోకి కోట్ల రాకకు వున్న అభ్యంతరాలు అన్ని తొలిగిపోయినట్టే అంటున్నారు. కోట్ల కుటుంబం టీడీపీలోకి రావడానికి కె.ఈ సోదరులు చేత ఓకే అనిపించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారట చంద్రబాబు. తాజా పరిణామాలతో కోట్ల కుటుంబం టీడీపీ లో చేరడం ఇక లాంఛనమే అంటున్నారు.

ap-cm-chandra-babu-naidu

కర్నూలు జిల్లాలో బలమైన రెడ్డి నాయకుడి కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు కోట్ల కుటుంబం మీద ప్రత్యేక ఆసక్తి చూపించారట. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి కర్నూల్ లోక్ సభ లేదా రాజ్యసభ తో పాటు ఆయన సతీమణి సుజాతమ్మ కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఓకే అన్నారట. టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్ బాగా ఉండడంతో పాటు అనుచరుల నుంచి కాంగ్రెస్ నుంచి బయటికి వెళదామని ఒత్తిడి వస్తుండడం తో కోట్ల కూడా బాబు ప్రతిపాదనకు దాదాపుగా ఓకే చెప్పినట్టే అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం అయిన వైసీపీ కి అటు కోట్ల కుటుంబం కూడా హ్యాండ్ ఇచ్చినట్టే అనిపిస్తోంది.