తెలంగాణలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, ఉపాధ్యాయుడు ఆత్మహత్య

తెలంగాణలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, ఉపాధ్యాయుడు ఆత్మహత్య
తెలంగాణలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, ఉపాధ్యాయుడు ఆత్మహత్య

తెలంగాణలో రెండు వేర్వేరు ఘటనల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కోసం ఉపాధ్యాయుడు భారీ రుణాలు తీసుకున్నడు మరియు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ షేర్ మార్కెట్‌లో నష్టాలను చవిచూడడంతో తీవ్ర చర్య తీసుకున్నాడు..

హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో జి.లక్ష్మీనారాయణ(37) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఖమ్మం జిల్లా గోళ్లపాడుకు చెందిన ఇతను హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇంటి వద్దనే పని చేస్తున్నాడు. అనారోగ్యంతో ఉన్న తన తండ్రి వైద్యం కోసం గ్రామంలోని కుటుంబ ఆస్తులను అమ్మేశాడు.

మిగిలిన రూ.20 లక్షలను లక్ష్మీనారాయణ షేర్‌మార్కెట్‌లో పెట్టగా మొత్తం పెట్టుబడి పోగొట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.

మరో ఘటనలో సూర్యాపేట జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీగా రుణం తీసుకుని డబ్బు పోగొట్టుకున్నాడని ఆరోపించారు.

అప్పు ఇచ్చిన వారు డబ్బులు రికవరీ చేయాలని ఒత్తిడి తేవడంతో జి. నరేంద్రబాబు (55) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని తీసుకెళ్తున్న వాహనాన్ని గ్రామంలోకి రాకుండా అప్పులు ఇచ్చిన వారు గురువారం అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వారు శాంతించారు.

భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగి అయిన నరేంద్రబాబు రూ.10 కోట్ల రుణం తీసుకున్నట్లు సమాచారం. ఆ డబ్బును ఎలా ఖర్చు చేశాడో వెల్లడించలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నట్లు అతని స్నేహితులు అనుమానిస్తున్నారు.