తేజ్‌ సినిమాకు విడుదల కష్టాలు

tej i love u movie release date postponed to july

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా హీరో సాయి ధరమ్‌తేజ్‌, కరుణాకరన్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘తేజ్‌ ఐలవ్‌ యు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రాన్ని ఇప్పటికే విడుదల చేయాల్సి ఉన్నా కూడా కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ చేయాల్సి వచ్చింది. దాంతో జూన్‌ చివరి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను దాదాపు నెల ఆలస్యంగా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాను ఇంత ఆలస్యంగా ఎందుకు విడుదల చేయబోతున్నారు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కాని జూన్‌లో ఈ చిత్రం లేదని మాత్రం క్లారిటీ వచ్చేసింది.

పవన్‌ కళ్యాణ్‌తో ‘తొలిప్రేమ’ వంటి అద్బుతమైన చిత్రాన్ని తెరకెక్కించి అందరి అభిరుచిని చూరగొన్న దర్శకుడు కరుణాకరన్‌ ఈ చిత్రంతో మరోసారి తన సత్తా చాటుతాడు అనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్‌ ఉన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘తేజ్‌’ చిత్రం ఇలా వరుసగా వాయిదాల మీద వాయిదాలు పడుతున్న కారణంగా సినిమాపై నమ్మకం పోతుంది. వరుసగా నాలుగు అయిదు ఫ్లాప్‌లతో సతమతం అవుతున్న మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు ఈ చిత్రం సక్సెస్‌ను దక్కించకపోతే ఆయన మరింతగా కష్టాల్లో పడటం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్రంను కేఎస్‌ రామారావు నిర్మించాడు. విభిన్నమైన ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రంతో తేజూకు సక్సెస్‌ గ్యారెంటీ అంటూ టాక్‌ వినిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాత భావిస్తున్నాడు. కాని సినిమాలో ఏదో ఒక సమస్య వస్తుందని, దాంతో రీ షూట్‌ చేయాల్సి వస్తుందని కొందరు చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో తేజ్‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.