టీఆర్ఎస్ మంత్రులు వీరే…అప్పుడే అలకలు…!

Telangana Cm Kcr All Set Expand Cabinet Likely Induct 10 Ministers

టీఆర్ఎస్ నేతలతోపాటు తెలంగాణ ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న కేబినెట్ విస్తరణ మంగళవారం ఉదయం 11:30 గంటలకు జరగనుంది. పది మందికి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కినట్టు తెలుస్తోంది. సోమవారం వారికి ఫోన్ చేసిన కేసీఆర్ రాజ్‌భవన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసానికి మళ్లీ కేబినెట్‌‌లో అవకాశం వచ్చినట్టు సమాచారం. విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికే అగ్ర తాంబూలం దక్కినట్టు స్పష్టం అవుతోంది. క్యాబినెట్‌లో చోటు దక్కుతున్న వారిలో ఆరుగురు కొత్తవారే కావడం గమనార్హం. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వనపర్తి నియోజకవర్గం), వి.శ్రీనివాస్‌గౌడ్‌ (మహబూబ్‌నగర్‌), కొప్పుల ఈశ్వర్‌ (ధర్మపురి), ప్రశాంత్‌రెడ్డి (బాల్కొండ), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), చామకూర మల్లారెడ్డి (మేడ్చల్‌). గత మంత్రివర్గంలో పనిచేసిన ఈటల రాజేందర్‌ (హుజూరాబాద్‌), జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట), ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్‌), తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ (సనత్‌నగర్‌)లకు రెండోసారిఅవకాశం దక్కుతోంది. డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు గౌడ్, చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్ ‌ఈరోజు ప్రమాణం చేయనున్నారని సమాచారం. తొలి విడతలో 9 మందితో క్యాబినెట్ ఉంటుందని ప్రచారం జరిగినా, సోమవారం అనూహ్యంగా మల్లారెడ్డి పేరు చేరింది. దీంతో కొత్త మంత్రుల సంఖ్య పదికి చేరింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఆర్థికశాఖ, ఎర్రబెల్లికి వ్యవసాయశాఖ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు పౌరసఫరాల శాఖ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మిగతా వారికి కూడా సీఎం శాఖలను ఖరారు చేసినట్టు తెలిసింది. చివరి నిమిషంలో మార్పులు జరిగితే తప్ప దాదాపుగా అవే శాఖలు కేటాయించవచ్చని సమాచారం. ఇక కీలకమైన నీటిపారుదల, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాలు తన వద్దనే ఉంటాయని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఒకవేళ అన్ని శాఖల నిర్వహణ కష్టంగా ఉంటే ఒకటి, రెండు శాఖలను మంత్రులకు అప్పగిస్తారని తెలుస్తోంది. మంత్రి వర్గంలో చోటు దక్కినవారికి ఈ విషయం గురించి సోమవారం ఉదయం సీఎం స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారు. క్యాబినెట్ కూర్పుపై సీఎం సుదీర్ఘంగా కసరత్తు చేశారు. జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, అనుభవం, రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తుది జాబితాను రూపొందించారు. ఉమ్మడి జిల్లాల ప్రకారం చూస్తే ఖమ్మం తప్ప మిగతా అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం దక్కింది. ఇక కీలకమైన నీటిపారుదల, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాలు తన వద్దనే ఉంటాయని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఒకవేళ అన్ని శాఖల నిర్వహణ కష్టంగా ఉంటే ఒకటి, రెండు శాఖలను మంత్రులకు అప్పగిస్తారని తెలుస్తోంది. మంత్రి వర్గంలో చోటు దక్కినవారికి ఈ విషయం గురించి సోమవారం ఉదయం సీఎం స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారు. క్యాబినెట్ కూర్పుపై సీఎం సుదీర్ఘంగా కసరత్తు చేశారు. జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, అనుభవం, రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తుది జాబితాను రూపొందించారు. ఉమ్మడి జిల్లాల ప్రకారం చూస్తే ఖమ్మం తప్ప మిగతా అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం దక్కింది. లోక్ సభ ఎన్నికల తర్వాత మరో ఆరుగురికి మంత్రి వర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అప్పుడు మహిళా మంత్రులకి చాన్స్ ఇచ్చే అవకాసం ఉంది. ఇక కేబినెట్‌ లో బెర్త్ దక్కని మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న తనకు కాకుండా టీడీపీ అభ్యర్థిగా తనతో పలుమార్లు తలపడిన శ్రీనివాసయాదవ్‌కు స్థానం కల్పించటంపై పద్మారావు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తలసానికి మంత్రి పదవి ఇవ్వటంపై తనకు అభ్యంతరం లేదని, అదే సమయంలో తనకు కూడా ఇస్తే సరైన గౌరవం ఉంటుందని పద్మారావు పార్టీ ముఖ్యనేతల వద్ద అన్నట్లు తెలుస్తోంది.