తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు !

telangana-elections-updates

తెలంగాణలో ఎన్నిక పోలింగ్ ముగిసింది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలకు 116 నియోజకవర్గాల్లో, ఒక గంట అంటే నాలుగు గంటలకు 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఐదు గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 5 గంటల తర్వాత వచ్చే ఓటర్లను బూత్ లోకి అనుమతించరు. అయితే చెదరుమదురు ఘటనలు మినహా పోలింగ్ మొత్తం ప్రశాంతంగానే జరిగింది. ఇక నేతల భవితవ్యం ఈవీఎంలలోకి చేరింది. పోలింగ్ విషయానికొస్తే పట్టణాల్లో ఓటింగ్ కాస్త మందకొడిగా సాగగా గ్రామీణ ప్రాంతాల్లో కాస్త పెరిగింది. ఫలితాలు ఈ నెల 11న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.