మహిళల ఆత్మబంధువు

మహిళల ఆత్మబంధువు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం పీపుల్స్‌ ప్లాజాలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో మహిళా బంధు పేరుతో ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. మహిళలు లేనిదే ప్రపంచమే లేదన్నారు. మహిళలకు సీఎం కేసీఆర్‌ ఆత్మబంధువుగా మారారని కొనియాడారు. పలు రంగాల్లో ఉత్తమ సేవలందించిన మహిళలను సత్కరించారు.

ఈ సందర్బంగా మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, కార్పొరేటర్లు మన్నె కవిత, సంగీతా యాదవ్‌తో పాటు ఆశా, పారిశుద్ధ్య కార్మికులు కేసీఆర్‌ చిత్రపటానికి రాఖీలు కట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలతా శోభన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎస్‌.కె.హైమద్, సలావుద్దీన్, వనం శ్రీనివాస్‌ యాదవ్, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.