వీడుతున్న కేసీఆర్ భ్రమలు…!

Telangana Nirudyoga Bruthi Kcr Announces Rs 3016

రానున్న ఎన్నికల్లో గెలుపు మీద కేసీఆర్ కు పట్టిన భ్రమలు వీడిపోతున్నాయా ? అనంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన నిన్న మేనిఫెస్టో ప్రకటన అనంతరం చేసిన ప్రసంగం దానికి మరింత ఊతం ఇస్తోంది. మొన్నటికి మొన్న అసలు నిరుద్యోగులు అంటే ఎవరు అని అమాయకంగా అడిగిన కేసీఆర్, నిరుద్యోగులను ఎలా నిర్ణయించాలి అంటూ ఎదురు ప్రశ్నలు వేసి మొత్తానికి తమ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఏవేవో హామీలు అమలు చేశారని ఇక్కడ కూడా చేయమంటే కుదరదని ఆయన మొన్న చెప్పుకొచ్చారు.

KCR-TRS-SABHA-SPPECH

కానీ నిన్న ప్రసంగం మీరు చూసినట్టయితే నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3016 రూపాయల నిరుద్యోగ భృతిని అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీలో గత ఎన్నికల ప్రచారంలో నెలకు రూ.2 వేలు ఇస్తామన్న భృతిని చంద్రబాబు నాయుడు సర్కార్ ఇటీవల వెయ్యి రూపాయలు చేయగా కేసీఆర్ మాత్రం దానికి మూడు రెట్ల నిరుద్యోగ భృతిని రాష్ట్ర నిరుద్యోగులకు అందించనున్నట్లు ప్రకటించారు. కొన్ని రోజుల్లో నిరుద్యోగ భృతికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగ భృతికి అర్హులుంటారని, అయితే 12 లక్షల మందికైనా రూ.3016 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. కేశవరావు కమిటీ త్వరలో తుది నివేదిక ఇచ్చాక మరిన్ని వివరాలపై మేనిఫెస్టో విడుదల చేస్తామని కేసీఆర్ వివరించారు. ఇంతేకాక దాదాపు అన్ని వర్గాల వారికి ఆయన మరిన్ని తాయిలాలు ప్రకటించారు.

kcr