ముందస్తు వేడి…సమావేశం అయిన జగన్ పార్టీ !

తెలంగాణా రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలు దాదాపు ఖాయమయినట్టే. మరో 8 -9 నెలలు ఉంటే ప్రజా వ్యతిరేకత ఎక్కువ అవుతుందని భావించిన కెసిఆర్ ఇప్పుడే ఎన్నికలకు సై అంటున్నారు. ఈ ముందస్తు ఎన్నికల వ్యవహారంలో బీజేపీ, టీఆర్‌ఎస్ పరస్పర సహకారంతోనే ముందుకు పోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కెసిఆర్ ముందస్తుకి రెడీ అవుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ పతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కూడా రెడీ అవుతున్నారు. తెలంగాణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉదయం 11:30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ నందు పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుంది.

YCP sajjala ramakrishna reddy

ఈ సమావేశానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. అయితే ఇప్పుడు ఈ సమావేశమే ఇప్పుడు కామెడీగా మారింది. ఎందుకంటే తెలంగాణాలో ఒక్క సీటు కూడా గెలవలేని జగన్ పార్టీ ఇప్పుడు ఏదో కొంపలు మునుగుతున్నట్టు సమావేశం కావడం ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. దానికి కొన్ని కారణాలని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో కెసిఆర్ ని ఓడించటానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కెసిఆర్ ని ఓడించటానికి, ఇరు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న వేళ, జగన్ మాత్రం కెసిఆర్ గెలుపు కోసం, ఇప్పటి నుంచి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.