ఆస్ట్రేలియాలో తెలంగాణా యువకుడు మృతి

telangana young man died in australia

ఆస్ట్రేలియాలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తెలంగాణ వాసి ఒకరు గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ వనస్థలిపురం భాగ్యలత బీడీఎల్‌ కాలనీకి చెందిన సామ అర్జున్‌రెడ్డి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. చదువు పూర్తయిన అనంతరం సిడ్నీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. సోమవారం ఆఫీసులో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే భార్యకు ఫోన్ చేసి తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అర్జున్ రెడ్డి అస్వస్థతకు లోనవడంతో ఆఫీసు సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. ఆయన వయసు 36 సంవత్సరాలు. ఆయనకు మహేశ్వరి అనే యువతీతో వివాహం జరగగా వీరికి కుమార్తె ఇషిక ఉంది. అర్జున్ స్వస్థలం నల్గొండ జిల్లా వలిగొండ మండలం గొల్లపల్లి. అర్జున్ మృతదేహాన్ని హైదరాబాద్‌ తీసుకొని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.