‘వర్మ’ అర్జున్‌ రెడ్డిని దించేశాడుగా..!

Arjun Reddy' Tamil remake In Varma

కేవలం బాలీవుడ్‌ చిత్రాలకు మాత్రమే పరిమితం అయిన బోల్డ్‌ కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే జంటగా సందీప్‌ వంగ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్‌ రెడ్డి చిత్రంపై వివాదం కూడా రాజుకున్న విషయం తెల్సిందే. వివాదాన్ని రాజేసినా కూడా సినిమాకు మంచి వసూళ్లు మాత్రం సాధ్యం అయ్యాయి. అర్జున్‌ రెడ్డి టాలీవుడ్‌లో ఒక ట్రెండ్‌ సెట్‌ చేసింది. అలాంటి సినిమా ప్రస్తుతం హిందీ, తమిళం, కన్నడం, మలయాళంలో రీమేక్‌ అవుతుంది.

Arjun Reddy And Varma

ఈ నాలుగు రీమేక్‌లలో మొదటగా తమిళంలో రూపొందుతున్న రీమేక్‌ ‘వర్మ’ రాబోతుంది. విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా ఈ చిత్రంతో పరిచయం కాబోతున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న బాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ‘వర్మ’ చిత్రం ఫస్ట్‌లుక్‌ మరియు టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. అంతా భావించినట్లుగానే టీజర్‌ చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా పలు సీన్స్‌ అర్జున్‌ రెడ్డిని దించేసినట్లుగా అనిపిస్తున్నాయి. ముద్దు సీన్స్‌ ఈ చిత్రంలో కూడా లెక్కకు మించి ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది. హీరో పాత్ర తీరు మరియు హీరోయిన్‌ బాడీలాంగ్వేజ్‌ పూర్తిగా అర్జున్‌ రెడ్డిని పోలి ఉంది. మొత్తానికి అర్జున్‌ రెడ్డిని దించేసినట్లుగా ‘వర్మ’ టీజర్‌ ఉంది. మరి సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.