‘దేవదాస్‌’ జంట మళ్లీ రానున్నారా?

Ileana And Ram Upcoming Movie In ajay Bhupathi Director

వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో రామ్‌, ఇలియానా ‘దేవదాస్‌’ చిత్రంతో హీరో హీరోయిన్‌గా పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ చిత్రం సంచలన విజయాన్ని దక్కించుకుని మొదటి సినిమాతోనే ఇద్దరు కూడా స్టార్స్‌ అయ్యారు. ఆ చిత్రం వచ్చి దాదాపు పుష్కర కాలం అవుతుంది. ఆ చిత్రం తర్వాత ఇలియానా తెలుగు మరియు తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకు వెళ్తున్న సమయంలోనే బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. అయితే హిందీలో ఈమె క్రేజ్‌ ఎక్కువ కాలం సాగలేదు. గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌లో ఈమెకు ఆఫర్లు కరువయ్యాయి.

Ram

ఇలాంటి సమయంలోనే టాలీవుడ్‌ నుండి ఈమెకు మళ్లీ పిలుపు వచ్చింది. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా నటిస్తుంది. దాదాపు రెండు కోట్ల పారితోషికం ఇచ్చి మరీ శ్రీనువైట్ల ఈ చిత్రంలో ఆమెను నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక వరుసగా టాలీవుడ్‌లో ఇలియానా సినిమాలు చేస్తానంటూ ప్రకటించిన నేపథ్యంలో ఈమెకు తన మొదటి హీరో రామ్‌తో నటించే అవకాశం కూడా దక్కినట్లుగా ప్రచారం జరుగుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ హీరోగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్‌ రూపొందబోతుంది. ఆ చిత్రంలో ఇలియానా ఒక హీరోయిన్‌గా ఎంపిక అయినట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.