బిగ్‌ బాస్‌ అంటేనే భయపడుతున్న నాని…!

Telugu Big Boss Season 2 Ends On This Sunday Episode

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ఈ ఆదివారం ఎపిసోడ్‌తో ముగియబోతుంది. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండవ సీజన్‌కు నాని హోస్టింగ్‌ చేస్తున్నాడు. రెండవ సీజన్‌ మొదలైనప్పటి నుండి కూడా కౌశల్‌ ఆర్మీ కారణంగా నాని ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉన్నాడు. నాని చేసిన చిన్న కామెంట్‌ను కూడా కౌశల్‌ఆర్మీ రచ్చ రచ్చ చేస్తూనే ఉన్నారు. కౌశల్‌ ఆర్మీ సోషల్‌ మీడియాలో నాని పరువు తీసినంత పని చేశారు. దాంతో నాని ఈ షో ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. తాజాగా ‘దేవదాస్‌’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నాని మీడియాతో మాట్లాడుతూ బిగ్‌బాస్‌ గురించి మాట్లాడేందుకు భయపడ్డాడు.

bigboss-koushal

మూడు నెలలుగా ‘బిగ్‌బాస్‌’ కారణంగా నానికి ప్రశాంతత లేకుండా పోయిందట. వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే కదా అని తాను ఒప్పుకున్నాను అని, కాని బిగ్‌ బాస్‌ ప్రతి రోజు ఫాలో అవ్వాల్సి వస్తుందని నాని చెప్పుకొచ్చాడు. గత కొన్ని వారాలుగా బిగ్‌బాస్‌ కారణంగా నాని చాలా ఒత్తిడికి గురవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు షో పూర్తి అవుతుందా అని ఎదురు చూస్తున్నాను, షో పూర్తి అయితే కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లుగా నాని చెప్పుకొచ్చాడు. షో పూర్తి అయితే గుండెల మీద భారం దింపుకున్నట్లు అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. నాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మూడవ సీజన్‌కు ఈయన హోస్టింగ్‌ చేస్తాడో లేదోఅనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

bigboss