ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఈ రోజు ఉదయం హత్యాయత్నం కలకలం రేపింది. ఆ పట్టణంలోని 39వ వార్డులో కౌన్సిలర్‌గా టీడీపీ నేత మంచాల రమేశ్ కుమార్తె పోటీ చేస్తున్నారు. దీంతో రమేశ్‌తో పాటు ఆయన సోదరుడిపై కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు.
అయితే ఐతానగర్‌లోని ఆయన ఇంటికి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను బయటకు పిలిచారు. ఆ తర్వతా దాడికి పాల్పడ్డారు. అయితే.. వారిని అడ్డుకొనేందుకు రమేశ్ సోదరుడు సతీశ్ తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన మెడపై తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా ఈ దాడిలో ఇరువురికి గాయాలయ్యాయి. కాగా ఈ హత్యాయత్నం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.