బెంగళూరులో ఉగ్రవాదుల కలకలం

బెంగళూరులో ఉగ్రవాదుల కలకలం

బెంగళూరులో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుపడటం కలకలం రేపింది. జాతీయ దర్యాప్తు బృందం బుధవారం ఓ ఇంటిపై దాడులు నిర్వహించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. అనుమానితులిద్దరూ ఐసిస్ (ISIS) ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 20 రోజుల కిందట అరెస్టైన ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బెంగళూరులో వీరు ఏవైనా విధ్యంసక కార్యకలాపాలకు ప్రణాళికలు చేశారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని NIA అధికారులు తెలిపారు.

20 రోజుల కిందట National Investigation Agency ఐసిస్‌తో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీరిలో ఒక వ్యక్తి తమిళనాడుకు చెందిన అబ్దుల్ అహ్మద్ క‌దీర్ (40) కాగా, మరో వ్యక్తి బెంగ‌ళూరుకు చెందిన ఇర్ఫాన్ న‌జీర్‌గా గుర్తించారు. వీరు ఇచ్చిన సమాచారంతో ఆ తర్వాత కొద్ది రోజులకే బెంగళూరులో ఓ ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించారు. నాటి నుంచి కర్ణాటక పోలీసులకు కలిసి ఎన్‌ఐఏ పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తోంది.