మహేష్ బాబు ఫ్యాన్స్ కి థమన్ ట్రీట్!

మహేష్ బాబు ఫ్యాన్స్ కి థమన్ ట్రీట్!
Cinema News

సూపర్ స్టార్ మహేష్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాంబినేషన్ లో ఇప్పటి వరకూ 5 మూవీ లు వచ్చాయి. అన్ని మూవీ కి థమన్ మంచి మ్యూజిక్ అందించారు. గుంటూరు కారం కి సరికొత్త మ్యూజిక్ ఇచ్చి ఆడియెన్స్ ని అలరించారు. మొదట్లో విమర్శలు వచ్చినా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుంది. థమన్ ట్విట్టర్ లో ప్రకటన చేస్తూ, మహేష్ బాబు అభిమానులకు ఆశ్చర్యం కలిగించేలా ఒక ప్రామిస్ ఇచ్చారు.

ఇప్పటికే ఉన్న ఆరు ట్రాక్‌లతో పాటు, డైహార్డ్ మహేష్ బాబు అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక పాటని సిద్ధం చేస్తున్నాడు. ఇది ఫ్యాన్స్ కి ట్రీట్ లా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది.