Crime: అసహజ శృంగారానికి బలవంతం.. యువకుడి దారుణ హత్య

Crime: Atrocious in Pragathinagar.. Selfie video viral on Champi's Instagram
Crime: Atrocious in Pragathinagar.. Selfie video viral on Champi's Instagram

అసహజ శృంగారానికి బలవంతం చేయడంతో ఓ యువకుడు(20) దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తర దిల్లీలో ఈ జనవరి 17న జరిగింది. అయితే ఈనెల 19న వెలుగులోకి వచ్చింది. తలపై బండ రాయితో మోదడంతో సదరు యువకుడు ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. నిందితుడు బిహార్కు చెందిన రాజేశ్గా పోలీసులు గుర్తిం చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. జనవరి 19న దిల్లీలోని మోరీ గేట్కు దగ్గరలోని డీడీఏ పార్క్ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించగా.. మృతుడి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. దీంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తులో భాగంగా స్థానికంగా ఉన్న 50 సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. మృతుడు ఉత్తర్ ప్రదేశ్లోని జలాన్ జిల్లాకు చెందిన ప్రమోద్ కుమార్ శుక్లాగా గుర్తించారు. శుక్లా కోయా మండిలోని ఓ దుకాణంలో పనిచేసేవాడు. నైట్ షెల్టర్లో ఉంటున్నాడు. ఫుటేజ్లో శుక్లాతో పాటు రాజేశ్ అనే వ్యక్తి చివరిసారిగా కనిపించాడు.

దీంతో అతడిని పట్నాలో అదుపులోకి తసుకుని దర్యాప్తు చేయగా విషయం బయటకు వచ్చింది. తనను శుక్లా అసహజ శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేసేవాడని నిందితుడు చెప్పాడు. దీంతో అతడిని హత్య చేసేందుకు ప్రణాళిక వేసుకుని హత్య చేసినట్లు రాజేశ్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.