అద్భుతమైన దేవాలయం ! తంజావూర్!!

thanjavur--Brihadeeswarar-

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భారతదేశం లో అనేక ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఎన్నో వింతలు విశేషాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి ఓ గుడి గురించి ఇప్పుడు తెలుసుందాం. ఈ గుడి తమిళనాడు లోని తంజావూరు జిల్లాలో ఉన్నది. దాని పేరే బృహదీశ్వర ఆలయం. దీన్ని రాజరాజ చోళుడు క్రీస్తు శకం 1004 లో మొదలు పెట్టి 1009 లోపూర్తి చేశారు. ఇది దాదాపు వేయి సంవత్సరాల పురాతనమైనది అని తెలుస్తుంది. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. ఈ ఆలయం లో దేవుడు’ని చోళ రాజు పదకొండవ శతాబ్దం లో ప్రతిష్టాపన చేశాడు. ఇక్కడ ఆలయం లోని శివలింగము దేశం లో అతి పెద్ద శివ లింగం గా పేర్కొంటారు 

Temple-at-Thanjavur,

ఈ శివ లింగం 3.7 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు గాను ఉన్న లింగం..ఇక ఈ శివలింగానికి అభిముఖంగాఉన్న నందివిగ్రహం కూడా భారీగానే ఉన్నది.ఇది సుమారుగా ఇరవై టన్నులు కలిగి ఉంది. 2.7మీటర్ల పొడవు, 2.5మీటర్ల వెడల్పు తో చూపరులను ఆకట్టుకునే విధంగా మలిచారు. బయట గోడల పై తమిళనాట కు చెందిన “కరణ” లను (నాట్య రీతులు), శిల్పాలను చెక్కారు.

thanjavur-Brihadeeswarar

ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి వంటివేవిఉపయోగించలేదు.నిర్మాణంపై ఎలాంటి పూతా పూయలేదు. పునాదుల దగ్గర నుంచి పీఠాలు, గోపురం, శిఖరం… ఇలా అన్నీరాళ్లతోనే తయారయ్యాయి. రాయి సాంద్రత, బరువునిబట్టి ఒక రాయి మీద మరో రాయిని పేర్చి నిర్మించారు. ఈ ఆలయ గోపురం 13 అంతస్తులు వుంది. కేవలం ఈ ఆలయ నిర్మాణం కోసమే సుదూరమునుండి గ్రానైట్ రాయిని తెప్పించి కట్టించినట్లు చరిత్ర చెబుతుంది. ఈఆలయ నిర్మాణాన్ని రాజా రాజా చోళుడు5 సంవత్సరాల కాలములో పూర్తిచేసినట్లు చరిత్ర చెప్తుంది.

Brihadeeswarar-Temple-at-Th

దేవాలయ ప్రాంగణం ఎంతో సువిసాలంగా ఉంటుంది.ఆలయప్రాకారం పొడవుదాదాపు 240 మీటర్ల, వెడల్పు125 మీటర్ల కలిగి ఉంటుంది. అంటే నాలుగు ప్రదక్షిణాలు చేస్తే ఒక కిలోమీటరు దూరం నడిచినట్లు.ఇక ఈ ఆలయ వెలుపలఉన్న గోడలపైన దేవుళ్ళ విగ్రహాలను కూడా చూడొచ్చు.వాటిలో దక్షిణా మూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పరిమాణం లో పెద్దవిగా ఉంటాయి.అంతే కాదు.అష్టదిక్పాలకులు కలిగి ఉన్నఏకైకదేవాలయం.ఇంద్రుడు, అగ్ని, యముడు, నిర్శింతి, వరుణుడు, వాయువు , కుబేరుడు, మరియు ఈశానుడు అనే అష్టదిక్పాలకులు. ఈ విగ్రహాలు జీవిత పరిణామం కలవి.అనగా ఆరు అడుగులఎత్తు కలవి .ప్రధాన దేవాలయ గోపురకలశం మొత్తం ఒకే శిలతో రూపుదిద్దుకుని 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినది.

thanjavurTemple-story-and-h

అంత ఎత్తుకు ఇంత పెద్ద గోపుర కలశాన్ని వేయి ఏళ్ళ క్రితం ఎలా ఎత్తగలిగారోఅనేది ఇప్పటికి ఒక అద్భుత మైన రహస్యంగా మిగిలి పోయింది. ఈ రాయిని గోపురంపైకి ఎత్తడానికి చాలా ఇబ్బంది పడ్డారట. గోపురం నుండి ఏడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ గ్రామం దగ్గర్నుంచి ఏటవాలుగా ఉండే ప్రత్యేక వంతెనను నిర్మించారు. శిఖరం రెండు తలలుగా ఉంటుంది. తంజావూరు చుట్టుపక్కల ఎక్కడా కొండలు, గుట్టలు కనిపించవు. ఈ రాళ్లను దాదాపు 150కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుకొవై ప్రాంతంలోని రెండు కొండల్ని పూర్తిగా తొలిచి తీసుకొచ్చి ఆలయం నిర్మించి ఉంటారని ఒక అంచనా. ఈ విశేష నిర్మాణాన్ని కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పిచే చేయబడినది. ఈ విషయములు అచట గల శాసనాల ద్వారా తెలియచేయబడినది .

thanjavur-temple

ప్రపంచం లోనే మొట్ట మొదటి సారి గ్రానైట్ రాయితో నిర్మించబడిన కట్టడముగా ఈ దేవాలయం ప్రఖ్యాతి గాంచింది…అయితే ఇక్కడ నుంచి కొన్ని వందలమైళ్ల వరకు ఒక్క గ్రానైట్ రాయి కూడా కనిపించదు. మరి పదమూడు అంతస్తుల ను ఒకే గ్రానైట్ రాయి తో ఎలా కట్టారో ఇప్పటికి అంతుచిక్కని విషయమే…గ్రానైట్ ఘనులనుంచి దేవాలయం వరకు ఎలా రవాణా చేశారు?రవాణా చేసాక నిర్మాణంచేపట్టినప్పుడు వాటి పై ఎలా శిల్పాలని చెక్కేవారు?అనేదిఅంతు తేలని రహస్యమే!

Temple

ఇక ఇదే ఆలయంలో మనకి ఆశ్చర్యం గొలిపే విషయము సంగీత స్థంబాలు .ఆలయ ప్రవేశ ద్వారం లోకి ప్రవేశించగానే గణపతి ఆలయం దర్శనమిస్తుంది ..ఇక్కడి శిలలు మనల్ని అబ్బుర పరుస్తాయి .ఒక రాతి స్థంభం పై మీటితే ఒక సంగీత శబ్దం .మరో రాతి పై మీటితే మరో లోహ శబ్దం వస్తుంది ..ఇవే కాకుండా మరిన్ని రాళ్ళూ విభిన్న శబ్ధాలని వినసొంపు గా వినిపిస్తాయి .

temple-news 

పదమూడు అంతస్థుల పైన ఎటువంటి వాలు లేకుండా నిలబడి ఉండటం అనేది ఇప్పటికి ఆశ్చర్యం కలిగించే విషయమే.ఇక ఇప్పటికి ఛేదించబడలేని రహ్యస్యం .ఆలయ నీడలు .మిట్ట మధ్యాహ్న సమయం లో ఆ గోపురం నీడ ఎక్కడా పడదు ..80 టన్నుల బరువు గల ఆ గ్రానైట్ రాయిని కలశం గా మలిచి అక్కడికి ఎలా తీసుకు వెళ్లారు అన్నదిఒక రహస్యంగా ఉండిపోయింది. అంత పెద్ద కలశాన్ని అక్కడికి తీసుకు వెళ్లడం అనేది ఆనాటి రాజుల టెక్నాలజీ కి మచ్చుతునక అని చెప్పొచ్చు.ఈ ఆలయాల ప్రాంగణం దాదాపు ఫర్లాంగు దూరం ఉంటుంది అంటే చాలా సువిశాలం గా కట్టారు అన్నది అర్ధమవుతుంది. ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ మాట్లాడుకునే మాటల శబ్దం మరల ప్రతిధ్వనించదు.అంత శబ్ద పరిజ్ఞానం తో ఈ గుడి ని కట్టారు.

Thanjavur-Brihadeeswarar-Te

ఈ ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి .ఇవి, కొన్ని తంజావూరు లో ని కొన్నిఆలయాలకిదారులు తీస్తే ఇంకొన్ని,మాత్రం మరణానానికి దారి తీసే గోతులు కలిగి ఉన్నాయని, ఆ దారులని మూసి వేశారు. అయితే టెక్నలాజి కి అంతు పట్టని విషయము ఏమిటి అంటే ఈ గుడి కి చుట్టూ ఉండే తోరణాలతో ఆరు మిల్లి మీటర్ లకన్నా తక్కువ ఉన్న సైజు ల వంపు తో కూడిన రంద్రాలు కనిపించడం అవి ఆలా ఎందుకు పెట్టారు అన్నది ఇప్పటికి మిస్టరీనే!

History-and-Interesting-fac

మరి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి?
తమిళనాడు లోని తంజావూరుకి అన్ని నగరాలనుండి రైలు, రోడ్డు , విమాన మార్గాలు ఉన్నాయి. చెన్నై నుంచి 314 కిలోమీటర్లు, తిరుచురాపల్లి నుంచి 56 కిలోమీటర్ల దూరoలోవుంది . దేశంలో ఎక్కడనుంచి అయినా చెన్నై కి చేరుకోవచ్చు అక్కడ నుంచి నేరుగా తంజావూరుకి చేరుకునే వీలు ఉన్నది .ఎప్పుడైనా మీరు తమిళనాడు కి వెళ్తే తంజావూర్ వెళ్ళడంమరవకండి!

Thanjavur,-Tamil-Nadu