లక్ష్మీ పార్వతి మీద ఆరోపణలు చేసిన కోటి వెలుగులోకి….కేయే పాల్ సోదరుడి హత్య ?

The allegation made against Lakshmi Parvathi is came

వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, సినీనటి పూనమ్‌కౌర్‌లపై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటి నిన్న నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఈయన మీద హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో రెండు కేసులు నమోదై ఉన్నాయి. తనపై సోషల్‌ మీడియాలో తీవ్రస్థాయిలో జరిగిన దాడి వెనుక కోటి అనే వ్యక్తి ఉన్నాడని లక్ష్మీపార్వతి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే సినీనటి పూనమ్‌కౌర్‌ కూడా తనపై గుర్తు తెలియని వ్యక్తులు అభ్యంతకరమైన పోస్టింగ్‌లు పెట్టారంటూ ఫిర్యాదు ఇచ్చారు. ఈ రెండు కేసులను సాంకేతికంగా దర్యాప్తు చేసిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు రెండు కేసుల్లోనూ కోటినే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా, లాయర్‌తో కలిసి వచ్చి లొంగిపోతానంటూ కోటి కొన్నాళ్లుగా సైబర్‌క్రైమ్‌ పోలీసులకు కబురు పంపుతూ వచ్చాడు. హఠాత్తుగా మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతని రాకని పసిగట్టిన పోలీసులు కోర్టుకు చేరుకునేలోపే కోటి న్యాయస్థానంలో లొంగిపోయాడు. కోటి న్యాయమూర్తి ముం దుకు రావడంతో కోర్టు కోటికి బెయిల్ మంజూరు చేసింది. ఒంగోలులో కేఏపాల్‌ సోదరుడు డేవిడ్‌రాజ్‌ హత్య కేసులోనూ కోటి నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.