వైసీపీ నేతల శాడిజం అంతా పైశాచిక రాతల్లో కనిపిస్తోంది : నారా లోకేశ్ ఆగ్రహం

the-sadism-of-the-ycp-leaders-appears-in-all-sentimental-writings-nara-lokesh-is-outraged

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టిన ఘటనపై ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా, నారా లోకేశ్ స్పందిస్తూ, ఎన్ఎస్జీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి నివాసాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించడమే కాకుండా, ఆ వివరాలను వైసీపీ పార్టీ పేజీలో, అందరికీ అందుబాటులో ఎలా ఉంచుతారు? ఏమిటీ కుట్ర?

అని ప్రశ్నించారు. ఈ కుట్రలో కిరణ్ ఎవరు? జగన్ నివాసంలో ఉండే కిరణ్ అమలు చేస్తున్న కుట్రకి నీటి పారుదల శాఖ అని కలరింగ్ ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతల శాడిజం అంతా సాక్షి పత్రిక పైశాచిక రాతల్లో కనిపిస్తోందని ఆయన విమర్శించారు.

చంద్రబాబు గారి నివాసంలోకి వరద నీరు వచ్చిందని సాక్షి పత్రికలో కథనం రాశారనీ, దీనికి ఔట్ హౌస్ ఫొటోను పెట్టారని దుయ్యబట్టారు. హై సెక్యూరిటీ కలిగిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఔట్ హౌస్ లోనే ఉంటారా? అని ప్రశ్నించారు.

అయినా చంద్రబాబు గారి నివాసానికి, ఔట్ హౌస్ కు మధ్య ఎంత దూరం ఉందో చూడండి అంటూ ఓ ఫొటోను ట్విట్టర్ లో నారా లోకేశ్ పోస్ట్ చేశారు.