టీజర్‌ రివ్యూ : యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా తొలిప్రేమ డైలాగ్‌

tholi prema teaser review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘తొలిప్రేమ’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరుణ్‌ తేజ్‌ సక్సెస్‌ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న కొత్త ‘తొలిప్రేమ’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. భారీ స్థాయిలో అంచనాలున్న ‘తొలిప్రేమ’ చిత్రం టీజర్‌ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్‌ కేవలం 30 సెకన్లు ఉన్నా, వరుణ్‌ చెప్పింది ఒక్క డైలాగే అయినా కూడా యూత్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా, ప్రతి ఒక్కరు ఆలోచించే విధంగా ఉంది, సినిమాపై అంచనాలు పెంచే విధంగా టీజర్‌ ఉంది. 

టీజర్‌లో వరుణ్‌ తేజ్‌ చెప్పిన మన జీవితంలోకి ఎంతో మంది అమ్మాయిలు వచ్చి వెళ్తూ ఉంటారు. కాని ఫస్ట్‌ ప్రేమించిన అమ్మాయిని మాత్రం ఎప్పటికి మర్చిపోలేం డైలాగ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రం ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. వరుణ్‌ తేజ్‌ ుక్‌ మరియు దర్శకుడు వెంకీ అట్లూరి టేకింగ్‌ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఈ చిత్రం తప్పకుండా హిట్‌ అవుతుందనేందుకు మరో కారణం దిల్‌రాజు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్ర డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ను దిల్‌రాజు తీసుకోవడంతో తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. 

ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌కు జోడీగా రాశిఖన్నా నటించింది. తొలిప్రేమ టైటిల్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యి వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ అవుతుందా అనేది చూడాలి. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ను సంక్రాంతి లేదా రిపబ్లిక్‌ డేకు విడుదల చేసే అవకాశం ఉంది. ‘ఫిదా’ తర్వాత వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో మరో సూపర్‌ హిట్‌ చిత్రంగా ఇది నిలుస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.