డియ‌ర్ కామ్రేడ్ ట్రైల‌ర్‌కి టైం ఫిక్స్

time fixed to dear comrade trailer

యూత్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌. దక్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో ఈ సినిమాను ఒకే రోజున విడుద‌ల చేస్తున్నారు. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ట్యాగ్ లైన్. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూలై 26న విడుద‌ల చేయ‌నున్నారు. ద‌క్షిణాది మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి పలు సాంగ్స్ విడుద‌ల చేయ‌గా, వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. జూలై 11 ఉద‌యం 11.11ని.లకి చిత్ర ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. ట్రైల‌ర్‌తో సినిమాపై మ‌రింత అంచ‌నాలు పెంచేలా టీం ప్లాన్ చేసింది. ర‌ష్మిక మంథాన చిత్రంలో కథానాయిక‌గా న‌టించిన విష‌యం విదిత‌మే.