టైమ్స్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌.. తొలి స్థానంలో హార్వర్డ్‌.. దేశంలో నం.1గా బెంగళూరు IISC

Times World University Rankings .Harvard on the first place. Bangalore IISC as No.1 in the country
Times World University Rankings .Harvard on the first place. Bangalore IISC as No.1 in the country

‘టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2024’ విడుదలయ్యాయి. ఈ జాబితాలో మొదటి స్థానంలో అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం చోటు దక్కించుకుంది. ఇక రెండో ప్లేస్​లో అదే దేశానికి చెందిన స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం నిలిచింది. ఇక బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ వర్సిటీలు 4, 5 ర్యాంకుల్లో నిలిచాయి. ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ పదో ర్యాంకు దక్కించుకుంది. భారత్​ నుంచి అత్యున్నత విద్యాసంస్థగా బెంగళూరులోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌’ (ఐఐఎస్‌సీ) స్థానం సంపాదించుకుంది.

భారత్​కు సంబంధించినంత వరకు ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లలో 100-125 ర్యాంకుల కేటగిరీలో; ఫిజికల్‌ సైన్స్‌లో 201-250 ర్యాంకుల కేటగిరీలో.. లైఫ్‌ సైన్సెస్‌లో 201-250 ర్యాంకుల కేటగిరీలో బెంగళూరు ఐఐఎస్‌సీ స్థానం దక్కించుకుంది. తెలంగాణ నుంచి హైదరాబాద్‌ ఐఐఐటీకి ఇంజినీరింగ్‌ విభాగంలో 201-600 ర్యాంకుల కేటగిరీలో స్థానం లభించగా.. ఇంజినీరింగ్‌ కేటగిరీలో అన్నా విశ్వవిద్యాలయం 301-400 ర్యాంకుల కేటగిరీలో చోటు దక్కించుకుంది. మరోవైపు జామియా మిల్లియా ఇస్లామియా, లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, శూలిని యూనివర్సిటీ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌; శిక్షా ‘ఒ’ అనుసంధాన్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలు 401-500 ర్యాంకుల కేటగిరీలో నిలిచాయి.