సామ్రాట్ రెడ్డిపై భార్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Samrat Reddy Arrested In Gold Robbery Case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ న‌టుడు సామ్రాట్ రెడ్డి పై దొంగ‌త‌నం కేసు పెట్టిన ఆయ‌న భార్య హ‌ర్షితారెడ్డి భ‌ర్త‌పై మ‌రిన్ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. తాను సామ్రాట్ రెడ్డిని ఎంతో ఇష్ట‌ప‌డి వివాహం చేసుకున్నాన‌ని, అయితే ఆ త‌ర్వాతే అత‌ని నిజ‌స్వ‌రూపం తెలిసింద‌ని హ‌ర్షిత చెప్పింది. త‌న భ‌ర్త చాలా దుర్మార్గుడ‌ని, తప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే కేసు న‌మోదు చేశాన‌ని తెలిపింది. ఎన్ని క‌ష్టాలు పెట్టినా ఎంతో స‌హ‌నంగా ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాన‌ని, కానీ ఓ సైకోలా మారి తీవ్రంగా హింసిస్తుండ‌డంతో గ‌త్యంత‌రం లేక దూరంగా వెళ్లిపోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తంచేసింది. త‌న భ‌ర్త‌కు ఎంతో మంది మ‌గ స్నేహితులు ఉన్నార‌ని, అత‌నికి, త‌న‌కు ఉన్న కామ‌న్ ఫ్రెండ్స్ ద్వారా త‌న భ‌ర్త ఓ గే అని తెలుసుకుని షాక్ తిన్నాన‌ని తెలిపింది. బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు త‌న‌తో బాగున్న‌ట్టు నాట‌కాలు ఆడుతూ ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత శారీర‌కంగా, మాన‌సికంగా వేధించేవాడ‌ని వాపోయింది. అత‌ని గురించి ఎన్ని విష‌యాలు తెలిసినా ఎప్ప‌టికైనా మార‌తారన్న ఆశ‌తో చానాళ్లు ఎదురుచూశాన‌ని చెప్పింది.

బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు కార్ డ్రైవింగ్ సీట్లో త‌న‌ను కూర్చోబెట్టి లేడీ డ్రైవ‌ర్ లా చూసేవాడ‌ని ఆరోపించింది. త‌న ప‌క్కనే కూర్చుని రాత్రంతా చాటింగ్ లు చేస్తుండేవాడ‌ని, అడిగితే కొట్టేవాడ‌ని ఆవేద‌న చెందింది. ఎప్పుడూ హుక్కా సెంట‌ర్ల‌లో తిరుగుతుండే వాడ‌ని, త‌నకు ఆ వాస‌న ప‌డ‌ద‌ని చెప్పినా విన‌డ‌ని, గంట‌లు గంట‌లు కూర్చుని హుక్కా, డ్ర‌గ్స్ తీసుకునేవాడ‌ని తెలిపింది. ఖ‌ర్చుల‌కు కావాల్సిన డ‌బ్బుల కోసం త‌న‌తో ఉద్యోగం కూడా చేయించాడ‌ని, ఇంట్లో కూర్చుని డ‌బ్బుల కోసం వేధించేవాడ‌ని, త‌న తండ్రి షేర్ల‌ను ట్రాన్స్ ఫ‌ర్ చేసేందుకు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో గ‌త ఏడాదిగా వేధింపులు ఎక్కువ‌య్యాయ‌ని వెల్ల‌డించింది. త‌న అత్త కూడా ఎంతో వేధించింద‌ని ఆరోపించింది. క‌ట్నం తీసుకురావాల‌ని వేధిస్తుండ‌డం వ‌ల్లే గ‌తంలో గృహహింస కేసు పెట్టాన‌ని హ‌ర్షిత తెలిపింది. త‌న సేఫ్టీ కోసం తండ్రి సీసీటీవీ కెమెరాల‌ను ఇంట్లో పెట్టించ‌డం వ‌ల్లే సామ్రాట్ పై పోలీసుల‌కు ఫిర్యాదుచేసే అవ‌కాశం ల‌భించింద‌ని తెలిపింది. ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఇంట్లో ప్ర‌వేశించి సామ్రాట్ సీసీటీవీ కెమెరాల‌ను ధ్వంసం చేశాడ‌ని, ఆభ‌ర‌ణాలు, విలువైన వ‌స్తువులు ఎత్తుకెళ్లాడ‌ని హ‌ర్షితా రెడ్డి మాదాపూర్ పోలీసుల‌కు ఫిర్యాదుచేసింది.