టచ్ చేసి చూడు ‘ప్రివ్యూ’…

Touch Chesi Chudu Movie Preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   రవితేజ, రాశి ఖన్నా, సీరత్ కపూర్ , సత్యం రాజేష్ , వెన్నెల కిషోర్ 
నిర్మాత:    నల్లమలపు బుజ్జి, వల్లభనేని వంశీ మోహన్ 
దర్శకత్వం :  విక్రమ్ సిరికొండ 
సినిమాటోగ్రఫీ:  చోటా కె. నాయుడు , రిచర్డ్ ప్రసాద్ 
ఎడిటర్ :   గౌతమ్ రాజు 
మ్యూజిక్ :  ప్రీతం (JAM8)

మాస్‌ మహారాజా రవితేజ రెండు సంవత్సరాల గ్యాప్‌ తర్వాత ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రవితేజ ది మాస్‌ అనిపించుకున్నాడు. ఆ సినిమాతో పాటే ప్రారంభం అయ్యి, కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయిన ‘టచ్‌ చేసి చూడు’ చిత్రాన్ని రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రవితేజ పవర్‌ ఫుల్‌ మాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ట్రైలర్‌ మరియు టీజర్‌లు సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకు వెళ్లాయి. తప్పకుండా సినిమా ఊహించిన స్థాయిలో ఉంటుందనే నమ్మకం సినీ వర్గాల్లో కూడా వ్యక్తం అవుతుంది. 

రవితేజ గతంలో పోలీస్‌గా నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అదే సెంటిమెంట్‌ రిపీట్‌ అవ్వడం ఖాయం అని, తప్పకుండా ‘టచ్‌ చేసి చూడు’ సినిమా బాక్సాఫీస్‌ ముందు దుమ్ము రేపడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. 2018లో ఇప్పటి వరకు ఒక్క సూపర్‌ హిట్‌ దక్కలేదు. జనవరి నెల మొత్తం వృదా అయ్యింది. పెద్ద సినిమాలు అని భావించిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమాతో అయినా సక్సెస్‌ను దక్కించుకుని 2018లో మొదటి సక్సెస్‌గా నిలుస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, రవితేజ ట్రాక్‌ రికార్డు మరియు ఇతరత్ర అంశాలను పరిశీలించి చూస్తే సినిమా తప్పకుండా బాక్సాఫీస్‌ ముందు వసూళ్లను కురిపించడం ఖాయం అనిపిస్తుంది. మరి కొన్ని గంటల్లో ‘టచ్‌ చేసి చూడు’ సినిమా ఫలితం ఏంటో తేలిపోనుంది.

టచ్ చేసి చూడు 'ప్రివ్యూ'... - Telugu Bullet