ప్రధాని ముందే సహచర మంత్రి నడుంమీద చెయ్యేసి…?

Tripura Minister Groping Woman Colleague On Stage With PM Modi Goes Viral

ప్రజా ప్రతినిధులు అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వారు. కానీ కొందరు ప్రజా ప్రతినిధుల తీరు సభ్యసమాజం తలదించుకునే విధంగా మారింది. తప్పుల మీద తప్పులు చేస్తూ కెమెరా కంటికి చిక్కి వారి విలువను పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ మంత్రి తన సహచర మంత్రితో అసభ్యంగా ప్రవర్తించి కెమెరా కంటికి చిక్కి అభినవ రావణునిగా సోషల్ మీడియాకి ఎక్కాడు. ఆయన తన సహచర మంత్రి నడుం మీద చెయ్యి వేసిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. తాజాగా త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో బీజేపీ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశం వేదికపై రాష్ట్ర మంత్రి మనోజ్ కాంతిదేవ్ తన సహచర మంత్రి సంతన చక్మాతో అసభ్యంగా ప్రవర్తించారు.

ఆమె నడుముపై చేయి వేసిన వీడియో బయటపడటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా మంత్రి కాంతిదేవ్ అనుచిత ప్రవర్తనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాంతిదేవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు ర్యాలీ నిర్వహించారు. అసభ్యంగా ప్రవర్తించిన కాంతిదేవ్ ను వెంటనే అరెస్టు చేయాలని ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) ఆధ్వర్యంలో మహిళలు అగర్తల నగరంలో నిరసన తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని మహిళలు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై పోరాటం చేయాల్సిన భాద్యత గల పదవిలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఇంతటి పనికి ఒడిగట్టటం చర్చనీయాంశమే. కాకపోతే ఈ ఘటనపై ఇరువురు మంత్రులు ఇంతవరకు స్పందించలేదు.