అమ్మనయితే ఆ పని చేయకూడదా ?

Troll shames Kasturi for item number despite being a mom

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కస్తూరి.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తెలుగు తెరపై గ్లామర్ తో వెలుగొందిన నిన్నటితరం కథానాయికలలో కస్తూరి ఒకరు. అన్నమయ్య, మా ఆయన బంగారం, సోగ్గాడి పెళ్లాం వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా చేసి అందరికీ సుపరిచితురాలయ్యింది కస్తూరి. అప్పట్లో కుర్రకారు మనసులు దోచేసిన కస్తూరి, పెళ్లయిన తర్వాత నటనకు దూరమయ్యారు. 2010లో ‘తమిళ పదం’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తరువాత నుంచి తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ ‘తమిళ పదం 2.0’లో ఓ ఐటెం సాంగ్ చేసిందామె. దీనిపై అందరి నుంచి  ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నా..

కస్తూరి చేసిన ఐటెం సాంగ్‌పై ట్విట్టర్‌లో ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇప్పుడు ఐటెం సాంగ్ చేయడం సరైనదేనా? బాధ్యతాయుతమైన ఓ తల్లిగా అలాంటి డ్యాన్స్ చేస్తారా? తల్లిగా పిల్లలను చూసుకునే బాధ్యత లేదా అని ప్రశ్నించాడు. దీంతో ఆమె అతడికి దీటైన జవాబిచ్చింది. ‘పెళ్లైన మగవాళ్లు మద్యం సేవించే సన్నివేశాలు .. ఐటమ్ సాంగులు చేస్తున్నారు కదా? మరి వాళ్లకి పిల్లల పట్ల బాధ్యత ఉండాల్సిన పనిలేదా? ఈ విషయంలో వాళ్లను ఎందుకు ప్రశ్నించరు? అమ్మనైనంత మాత్రాన ఐటమ్ సాంగ్ చేయకూడదనే నిబంధనేదైనా ఉందా? స్త్రీ పురుష సమానత్వం ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి తెలుస్తోంది. ఇలాంటి ప్రశ్నలతో దానిని పాతాళానికి తొక్కేయకండి’ అంటూ సమాధానమిచ్చారు. మరోవైపు కస్తూరికి చాలా మంది నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు.