జగన్ ఏ మాట అంటే ఆ మాటకే వత్తాసు పలికే జగన్ సైన్యం సహా ఆ పార్టీ నేతలు ఒకటే పాట పడుతూ ఉన్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాము.జగన్ ఏమంటే దానికి మద్దతు ఇస్తూ ఆది తప్పిన మాటలను ప్రశ్నించిన వైసీపీ నేత ఒక్కరు కూడా లేకపోవడం నిజంగా బాధాకరం.గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ అమరావతి నిర్మాణానికి పూర్తి మద్దతు ఇచ్చి ఇప్పుడు వాళ్ళ ప్లేట్ లో వాళ్ళ బిర్యానీ తినడానికి ఇష్టమొచ్చినట్టు రాజధానిపై నిర్ణయాలు తీసుకుంటుండడంతో ప్రజలు సహించడం లేదు.
దీనికి తగ్గట్టు అప్పుడు జగన్ సపోర్ట్ చేసాడని వాళ్ళు చేసి ఇప్పుడు చెయ్యడం లేదు.అసలు ఇలాంటి నిబద్దత లేని రాజకీయాలు చేసి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో అర్ధం కావట్లేదు.ఇదిలా ఉండగా అలా గతంలో ఒకలా మాట్లాడి ఇప్పుడు మరొకలా మాట్లాడుతున్న రోజాపై టీడీపీ అధికారిక సోషల్ మీడియా వారు మామూలు ట్రోల్స్ వెయ్యడం లేదు.తాజాగా ఒక వీడియో పెట్టి అందులో రోజా మాటలకూ కౌంటర్ ఇస్తున్నట్టుగా సామాన్య ప్రజలు మాట్లాడుతున్న క్లిప్పింగులు పెట్టి “జబర్దస్త్” రేంజ్ లో పంచ్ లు వేసే ఎఫెక్టులు కూడా పెట్టారు.మరి ఇది ఆమె వరకు వెళ్లినట్టయితే ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి.