హరీష్ కి అక్కడ స్కెచ్ పెట్టారా…?

Harish Rao Reaction On KCR Cabinet Expansion

తెలంగాణ ఎన్నికలలో గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస్ అధికారం లోకి రావటం ఆ వెంటనే కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేయటం చకచకా జరిగిపోయాయి. అయితే గులాబీ బాస్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ని నియమించిన నాటి నుంచి మరో ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్‌ని త్వరలోనే ముఖ్యమంత్రి సీట్లో కుర్చోపెట్టనున్నారనే టాక్ ఎక్కువైంది. దీంతో ప్రతీ ఒకరి చూపు టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు పై పడింది. కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తే హరీష్ రావు పరిస్థితి ఏంటి? ఆయన ఏమవుతారు అన్న ఆసక్తి, టెన్షన్ అందరిలోనూ నెలకొంది. అప్పటి నుంచి హరీష్ రావు గురించి ఏదో ఒక వార్త ప్రతిరోజు జనంలో నానుతూనే ఉంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం హరీష్ రావును వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీచేయించి రాష్ట్ర రాజకీయాలకు దూరం చేయనున్నారనే వార్త పొలిటికల్ సర్కిల్స్‌లో రావడం తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో తెలంగాణ కొత్త కేబినెట్‌లో హరీష్ రావుకు ఈసారి భారీ నీటిపారుదల శాఖ కూడా కేటాయించడం లేదనే మరో వార్త కూడా హరీష్ వర్గాన్ని కలవరపెడుతోంది.

harish-rao-emotional-speech

ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్‌తో కలిసి టీఆర్ఎస్ పార్టీని మొదటి నుంచీ నడిపిస్తూ కీలకంగా వ్యవహరించింది హరీష్ రావు మాత్రమే. తీరా ఇప్పుడు ఆయనను పార్టీ విస్మయించటం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. లోలోపల ఏదో జరుగుతోందనే కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. దీనికి తోడు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న 7 గంటల పాటు నిర్వహించిన సమావేశంలో పలు సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించారు. అయితే నీటిపారుదల శాఖ మంత్రిగా విశేష సేవలందించిన హరీష్ రావు ఈ సమావేశానికి హాజరుకాకపోవడంతో అంతా షాక్ అయ్యారు. కరీంనగర్ ఎంపీ వినోద్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రమే ఈ సమావేశంలో పాల్గొనటం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకటిలా హరీష్‌కు ప్రాధాన్యం ఇవవటం లేదా ? తన కొడుకును ముఖ్యమంత్రి చేసి పార్టీ తానే కీలకంగా వ్యవహరిస్తూ చక్రం తిప్పాలని భావిస్తున్నారా? అలా చేసి హరీష్ ను తన వెంట కేంద్రానికి తీసుకుపోతున్నారా అనే కోణంలో చర్చలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈసారి కీలకమైన ఇరిగేషన్ శాఖను హరీష్‌కు ఇస్తారా? లేదా ఎంపీగా పంపిస్తారా ? అనే భయం హరీష్ వర్గాన్ని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ రాజకీయ భవిష్యత్ కోసమే కేసీఆర్ ఇలా హరీష్ రావును పక్కన పెడుతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరికొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ అనివార్యంగా జరగనుండడం వలన ఈ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.