హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా

యావత్తు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తోన్న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యతలో ఉంది. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్టు గొడౌన్‌ లో ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంబించారు. మొత్తం 14 టేబుళ్లు, 22 రౌండ్లు ఏర్పాటు చేయగా ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్ ఇంకా పరిశీలకుడిని నియమించారు.

హుజూర్‌ నగర్ నియోజక వర్గం 1957లోఏర్పడింది. పీడీఎఫ్‌కు చెందిన దొడ్డ నర్సయ్య 1957 ఎన్నికల్లో భాస్కర రావు కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపు పొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అక్కిరాజు వాసుదేవ రాజు 1962 ఎన్నికల్లో దొడ్డ నర్సయ్య సీపీఐ అభ్యర్థిపై గెలుపుపొందారు. 1972లో స్వతంత్ర అభ్యర్థి కీసర జె.రెడ్డి అక్కిరాజు వాసు దేవరాజుపై గెలుపు పొందారు.

మళ్ళీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ అభ్యర్థి 2009లో ఉత్తమ్ కుమార్ రెడ్డి జగదీశ్ రెడ్డిపై విజయం సాధించారు. తర్వాత  2014 ఎన్నికల్లో శంకరమ్మ టీఆర్ఎస్ పై ఉత్తమ్ గెలుపు సాదించారు.

అత్యధిక మెజార్టీ సాధించిన నేతగా టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి రికార్డు సాదించారు. ఎనమిదవసారి జరిగిన నియోజకవర్గ ఎన్నికలలో అత్యదిక 43,284 వేల మెజార్టీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిపై గెలుపు సాదించి హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగిరెలా చేశారు.