కేసేఆర్ బడా స్కెచ్…మోడీతో భేటీ అందుకేనా ?

Trs party mp to become deputy rajya sabha speaker

 

పాపం మోడీకి తెలుగు రాదూ కదా అని రాష్ట్రంలో మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నా కేంద్రస్థాయిలో మాత్రం తెలంగాణా సీఎమ్ కేసీఆర్ మోడీతో మంచి సంబంధాలే నడుపుతున్నారు. అయితే ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంటూ కొత్త ప్రతిపాదన తెచ్చింది కూడా మోడీ డైరెక్షన్ లోనే అనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఒక కొత్త వార్తా ఇప్పుడు ఢిల్లీ రాజాకీయ వర్గాల్లో హాల్ చల్ చేస్తోంది. అదేమిటి అంటే ఈ సంబంధాల సాయంతో ఏకంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవిని సాధించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ మోడీతో సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చించారని ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయని తెలుస్తోంది. సహజంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోస్టును విపక్షాలకు ఇస్తూ ఉంటారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విషయంలో సంప్రదాయాలు ఉల్లంఘించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కసరత్తు మొదలు పెట్టారు అందుకే ఆ పదవిని బీజేపీ లేదా.. తమకు అనుకూలంగా ఉన్న పార్టీల ఖాతాలో వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మోడీ దృష్టిలో టీఆర్ఎస్ ప్రముఖంగా ఉంది. అయితే కేసీఆర్ కూడా ఆ పదవి తమకు వస్తే మరింత బలం వస్తుందనే భావంలో ఉన్నారని డిప్యూటీ చైర్మన్ పదవి కోసం తృణముల్, సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ ఉంటుందని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ ఆ పార్టీల మద్దతు కోసం కూడా ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.

ఆ రేసులో కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ కేశవరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కురియన్‌ పదవీ కాలం ముగియడంతో ఆగస్టులో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ లేదు. అభ్యర్థిని డిప్యూటీ చైర్మన్‌గా నెగ్గించుకోవాలంటే బీజేపీ కూటమికి 122 మంది కావాలి. ప్రస్తుతం సభలో ఆ కూటమికి 87 మంది సభ్యులున్నారు. యూపీఏకు 58 మంది సభ్యులున్నారు . కాబట్టి కాంగ్రెస్, బీజేపీలు ఇతరపార్టీల మద్దతు లేకుండా తమ అభ్యర్థిని డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక చేసుకోలేరు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాలకే డిప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయిస్తే తమకు అవకాశం ఇవ్వాలని మోడీని కేసీఆర్ కూడా కోరినట్టు సమాచారం.

విపక్షాలను దెబ్బ కొట్టేందుకు ఏ పరిణామాన్ని వదలుకొని బీజేపీ అన్ని అవకాశాలనూ పరిశీలిస్తోంది. అవసరమైతే టీఆర్‌ఎస్‌ లేదా బీజేడీకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టాలని కమలనాధుల అంచనాగా తెలుస్తోంది. ఆ లెక్కన ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు రాజ్యసభలో ఆరుగురు, బీజేడీకి తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. ఈ రెండు పార్టీల్లో ఎవరికైనా డిప్యూటీ చైర్మన్‌ పదవిని ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. టీఅరెస్ బయటకు బీరలుపలుకుతున్నా లోలోపల మోడీ భజన చేస్తుందనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి కానీ బీజేడీ మాత్రం కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరం పాటిస్తోంది. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ కే ఈ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే కేసీఆర్ చెప్పుకొచ్చే ఫెడరల్(ఫ్రంట్) మాటలకి ఇక భవిష్యత్లో విలువ లేకుండా పోతుంది.