బేరసారాల్లో టీవీ 9, మహా టీవీ?

tv9 and maha tv channels will selling

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రెండు తెలుగు టీవీ ఛానెల్స్ అమ్మకానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అందులో సక్సెస్ ఫుల్ టీవీ 9 కి భారీ ధర పలుకుతుంటే ఆదినుంచి ఆపసోపాలు పడుతున్న మహా టీవీ ని కారుచౌకగా అమ్ముదామన్నా పెద్ద డిమాండ్ రావడం లేదట. ఈ రెండు ఛానెల్స్ కి వస్తున్న బేరాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.

టీవీ 9 ని అమ్మేస్తున్నారని వార్తలు రావడం ఇప్పుడే మొదలు కాదు. కానీ ఈసారి ఒట్టి పుకారు మాత్రమే కాదని తెలుస్తోంది. మీడియా సర్కిల్స్ లో బిజినెస్ గురించి తెలిసిన వాళ్ళు ఈసారి డీల్ విషయంలో గట్టి కసరత్తే జరుగుతోందని చెబుతున్నారు. టీవీ 9 తో పాటు దాని అనుబంధ ఛానెల్స్ విలువని మదించే పని మొదలైంది. ఇప్పుడు తెలుస్తున్న దాని ప్రకారం టీవీ 9 విలువ 850 నుంచి 1000 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా. ఈ మదింపు పూర్తి అయ్యాక టీవీ 9 అమ్మకం పనులు మొదలవుతాయట. దాదాపు ఐదు సంస్థలు టీవీ 9 కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయంట. ఒకప్పుడు పదుల కోట్లలో పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థలో ప్రధాన వాటాదారు శ్రీని రాజు. ఆయనకి ఇందులో 80 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎడిటోరియల్ బాధ్యతలు చూస్తున్న రవిప్రకాష్ కి సైతం ఇందులో వాటా ఉందట. ఇప్పుడు వెయ్యి కోట్ల ఆఫర్ వస్తే వీరికి ఒక్కసారే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది.

ఇక మహా టీవీ విషయానికి వస్తే భిన్నమైన పరిస్థితి. ఆంధ్రజ్యోతి లో సంపాదకత్వ బాధ్యతలు చుసిన i వెంకటరావు నేతృత్వంలో సుజనాచౌదరి ఆర్ధిక అండతో మహా టీవీ మొదలైంది. అయితే ఏ దశలో కూడా మహా టీవీ మిగతా ఛానెల్స్ కి దీటుగా నడవలేకపోయింది. ఎంత ప్రయత్నించినా పరిస్థితి మెరుగు పడకపోవడంతో దీన్ని వదిలించుకోడానికి ఐ.వెంకటరావు, సుజనా చౌదరి ప్రయత్నాలు మొదలెట్టారు. కనీసం 15 కోట్ల రూపాయలు వచ్చినా ఆ సంస్థని వదిలేసుకోడానికి వారు సిద్ధంగా ఉన్నారట. అయితే ఇంకా చీప్ గా అడగడంతో వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట.