వెంకీ, త్రివిక్రమ్‌.. ఇదో మల్టీస్టారర్‌…!

Two Heroes Are Waiting For Trivikram

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ప్రస్తుతం చేస్తున్న ‘అరవింద సమేత’ చిత్రం విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే వెంకటేష్‌తో ఒక చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. మరో వైపు నాపేరు సూర్య చిత్రం విడుదలైన తర్వాత విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయాలని అల్లు అర్జున్‌ భావించాడు. కాని ఆ సినిమా క్యాన్సిల్‌ చేసుకుని మరీ త్రివిక్రమ్‌తో తర్వాత సినిమాకు సిద్దం అవుతున్నాడు. అంటే త్రివిక్రమ్‌ కోసం ఇద్దరు హీరోలు వెయిటింగ్‌ చేస్తున్నారు. దాంతో విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్‌ తర్వాత సినిమా మల్టీస్టారర్‌ అయ్యి ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది.

trivikram

ఈమద్య టాలీవుడ్‌లో వరుసగా మల్టీస్టారర్‌లు వస్తున్నాయి. నిన్ననే నాని, నాగార్జున నటించిన దేవదాస్‌ చిత్రం విడుదల అయ్యింది. ఆ చిత్రం భారీ ఎత్తున క్రేజ్‌ను దక్కించుకున్న నేపథ్యంలో మరిన్ని మల్టీస్టారర్‌ చిత్రాలను తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెంకీ ఇప్పటికే రెండు మల్టీస్టారర్‌ చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు వెంకీ అల్లు అర్జున్‌తో కూడా ఒక మల్టీస్టారర్‌ చిత్రం చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. భారీ ఎత్తున ఈ చిత్రంను నిర్మించేందుకు రాధా కృష్ణ ఏర్పాట్లు చేస్తున్నాయి. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌ పైకి వెళ్లనుంది. అదే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

trivikram-venkatesh