రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

కారు అదుపు తప్పి చెట్టును ఢీకొని బోల్తా పడి తెలంగాణకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా జవళగేర వద్ద గురువారం తెల్ల వారు జామున చోటు చేసుకుంది. తెలంగాణలోని గద్వాల తాలూకా కాళ తిమ్మన దొడ్డి(కేటీదొడ్డి)కి చెందిన నల్ల హనుమంతు కుమారుడు గోపాల్‌ (29) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయనకు గత ఏడాది ఐజకు చెందిన చంద్రకళతో వివాహమైంది.

ఈదంపతులు మరో ముగ్గురితో కలిసి బెంగళూరు నుంచి కారులో స్వగ్రామానికి వెళుతుండగా జవళగేరి వద్ద వాహనం అదుపు తప్పి తప్పి చెట్టును ఢీకొని పక్కనే ఉన్న పొలంలోకి బోల్తాపడింది. ఘటనలో గోపాల్, కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించారు. చంద్రకళకు రెండు కాళ్లకు గాయాలయ్యాయి. కొర్విపాడుకు చెందిన మహిళ, మరొకరు గాయపడగా రాయచూరు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. సింధనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.