కణాల మీద ఇన్సులిన్ ప్రభావం

కణాల మీద ఇన్సులిన్ ప్రభావం

తగినంత ఇన్సులిన్‌ని ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేయలేకపోయినా, లేదా కణాల మీద ఇన్సులిన్ ప్రభావం సరిగ్గా లేకపోయినా పేషెంట్‌లో హైపర్ గ్లైసీమియాతో పాటు ఇతర సమస్యలు కూడా ఉంటాయి. ఈ కాంప్లికేషన్స్ లో బ్లడ్ వెస్సెల్స్, నెర్వ్స్ లో ఇంఫెక్షన్ వంటివి కూడా ఉండవచ్చు.హైపర్ గ్లైసీమియా యొక్క లక్షణాలలో మాటిమాటీకీ బాత్రూమ్ కి వెళ్ళవలసి రావడం, నీరసం, బరువు తగ్గడం, ఆకలి పెరగడం, మాటిమాటికీ ఇన్ఫెక్షన్స్ రావడంతో పాటు డయాబెటీస్‌కి ఉండే ఇతర కాంప్లికేషన్స్ అయిన హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి కూడా ఉంటాయి.

ఇందులో ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేయకపోవడం ఉంటుంది. దాంతో రెగ్యులర్‌గా ఇన్సులిన్ ట్రీట్మెంట్ తప్పనిసరి. అప్పుడే కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేసి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలం. ఇది సాధారణంగా పిల్లల్ని, టీనేజ్‌లో ఉన్న వారిని అఫెక్ట్ చేసినా కూడా ఏ వయసులో అయినా కూడా ఇది రావచ్చు. సెల్స్‌కి, లేదా ప్యాంక్రియాస్‌కి డ్యామేజ్ జరగడమనేది జెనెటిక్‌గా ఉండవచ్చు. లేదా వైరల్ లెవెల్స్, ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్ వల్ల కూడా జరగవచ్చు. ఈ టైప్ డయాబెటీస్ జీవనశైలి మార్పులనేవి తప్పని సరిగా ఉండాలి. ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా ఉండాలి. ఇతర పరిస్థితులలా కాకుండా ఇందులో ఆ రకమైన డయాబెటీస్ ఉన్న వ్యక్తి యొక్క పార్టిసిపేషన్, ఇంకా మెడికల్, సోషల్ సపోర్ట్ చాలా అవసరం.

బ్లడ్ షుగర్‌ని మానిటర్ చేసుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి.అలాగే, కొలెస్ట్రాల్, బీపీ కూడా కంట్రోల్‌లో ఉంచుకోవాలి.డాక్టర్ సూచనల ప్రకారం బ్లడ్ షుగర్‌ని ఇన్సులిన్ షాట్స్ ద్వారా మ్యానేజ్ చేసుకుంటూ ఉండాలి.విశ్రాంతి, రిలాక్సేషన్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజెస్ చేయడం ద్వారా యాక్టివ్‌గా ఉండాలి.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.కిడ్నీ ప్రాబ్లమ్స్, కంటి సమస్యలు, కార్డియో వాస్క్యులర్ కాంప్లికేషన్స్ రాకుండా ఎలా ఎవాయిడ్ చేయాలో, వస్తే వాటిని ఎలా గుర్తించాలో డాక్టర్‌ని అడిగి తెలుసుకోవాలి.

అల్బుమిన్ లెవెల్స్ చెక్ చేసుకోవడం కోసం రెగ్యులర్‌గా యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి.రెటినోపతీ కోసం ఫండస్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి.బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడంతో పాటు లిపిడ్ ఎసెస్మెంట్ తప్పనిసరి.టైప్ 2 డయాబెటీస్ అనేది ఒక కామన్ టైప్. ఇందులో ఇన్సులిన్ యాక్షన్ ఇనెఫెక్టివ్‌గా ఉంటుంది. అంటే ఇన్సులిన్ విడుదల సరిగ్గా జరగదు. ఈ డయాబెటీస్ ఉన్న వారు సాధారణంగా పెద్దవారయి ఉంటారు, ఒబెసిటీ ఉండి ఉంటారు, సెడెంటరీ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడి ఉంటారు. ఇందులో కొన్ని కాంప్లికేషన్స్ రాకుండా చూసుకుంటే జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు.

ఈ పేషెంట్స్ బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. స్మోకింగ్ ఎవాయిడ్ చేయాలి, బరువు కంట్రోల్‌లో ఉంచుకోవాలి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి, హార్ట్ డిసీజ్ యొక్క రిస్క్ ని తగ్గించుకోవాలి. ఈ రకమైన డయాబెటీస్ ఉన్న వారు తిమ్మిరిగా ఉండడం, కాళ్ళు, చేతులు వీక్‌గా అనిపించడం, మాట ముద్ద ముద్దగా రావడం, తలనొప్పి, కళ్ళు తిరిగినట్లుండడం వంటి స్ట్రోక్ వచ్చే లక్షణాల విషయంలో సరైన అవగాహనతో ఉండాలి. కిడ్నీ డిసీజ్‌ని ముందే కనుక్కోవడం కోసం రెగ్యులర్‌గా యూరిన్ ఆల్బుమిన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి.

ఇది మూడవ రకమైన డయాబెటీస్, ఇది సాధారణంగా ఇంతకు ముందు డయాబెటీస్ లేకుండా ఉండి ప్రెగ్నెన్సీ సమయంలో వస్తుంది. గర్భం ధరించిన 27వ వారంలో ఈ కండిషన్‌ని కనుక్కోవడం కోసం గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు. ఒక సారి ఈ కండిషన్ ఉందని తెలిస్తే, ప్రెగ్నెన్సీలో ప్రతి విషయాన్ని గమనిస్తుండాలి. ఎందుకంటే ఫీటస్‌కి కూడా రిస్క్ ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న గర్భవతులు రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉండాలి, డైట్ సరిగ్గా తీసుకోవాలి, డాక్టర్ సూచనల ప్రకారం ఇన్సులిన్ డోస్ తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా, డెలివరీ తరువాత ఈ సమస్య కంట్రోల్ లోకి వచ్చేస్తుంది. బరువు ఎక్కువగా ఉన్న తల్లులు మాత్రం భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా ఉండడం కోసం ఫాలో అప్ చేయించుకుంటూ ఉండాలి.