కేంద్రమంత్రికే వేధింపులు…ఇక సామాన్యుల పరిస్థితేంటి ?

Union Minister anupriya patel eve teased uttar pradesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కాదేదీ కవితకనర్హం అని ఓ కవి అన్నట్టు ఆకతాయిల ఈవ్ టీజింగ్ కు సామాన్యులే కాదు కేంద్ర మంత్రులు కూడా బాధితులే అని నిన్న జరిగిన ఓ ఘటన నిరూపించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ నిన్న అర్ధరాత్రి ఈవ్ టీజింగ్ కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గం మీర్జాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె… తిరిగి వారణాసికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఏకంగా ఒక కేంద్రమంత్రే ఇలా ఆకతాయిల బారిన పడటం దేశంలో స్త్రీలకున్న రక్షణ ఏపాటిదోనని విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ ఘటన పై మంత్రి అనుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఔరాయ్, మీర్జామురాద్ మధ్య కారులో ప్రయాణిస్తుండగా ముగ్గురు దుండగులు తనును వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నంబరు ప్లేట్ లేని కారులో వచ్చిన ఈ దుండగులు తన వాహన శ్రేణిని దాటేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. తన భద్రతా సిబ్బంది వారిని హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, తన భద్రతా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారని తెలిపారు. అనుప్రియ పటేల్ ఈ ఫిర్యాదును వారణాసి ఎస్ఎస్‌పీ ఆర్ కే భరద్వాజ్‌కు సమర్పించారు. భరద్వాజ్ తక్షణమే స్పందించి, నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులను అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు.