గుడ్‌ న్యూస్‌.. మరో మల్టీస్టారర్‌

Up coming Multi-starrer movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఈ సంవత్సరం ప్రథమార్థంలో తమిళనాట విడుదలైన చిత్రం ‘విక్రమ్‌ వేద’. ఈ చిత్రంలో మాదవన్‌ మరియు విజయ్‌ సేతుపతిలు హీరోలుగా నటించారు. తమిళనాట మాస్‌ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అరించిన ఆ సినిమా మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. ఆ చిత్రం కథ తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి కూడా బాగా సూట్‌ అవుతుందని తెలుగు నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ఆ సినిమాను రీమేక్‌ చేసేందుకు పోటీ పడుతున్నారు. మొదటగా ఆ చిత్రాన్ని డబ్బింగ్‌ చేయాలని భావించినప్పటికి రీమేక్‌ అయితేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఒక నిర్మాత రీమేక్‌ హక్కులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా కొంత మంది కూడా ఇప్పటికే రీమేక్‌కు సంబంధించిన చర్చలు మొదలు పెట్టారు. 

మాధవన్‌, విజయ్‌ సేతుపతిలు నటించిన ఆ సినిమాలో రానా, రవితేజలు నటించనున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తెలుగులో ఒక ప్రముఖ దర్శకుడు రీమేక్‌కు దర్శకత్వం వహించేందుకు సిద్దం అవుతున్నాడు. ఆ సినిమా కథకు చిన్న చిన్న మార్పులు చేసి స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఇక విక్రమ్‌ వేద చిత్రంలో మాధవన్‌ పోషించిన పాత్రను రానా మరియు సేతుపతి పోషించిన పాత్రను రవితేజ చేసే అవకాశం ఉంది. 

తెలుగులో మల్టీస్టారర్‌ చిత్రాలకు మంచి మార్కెట్‌ ఉంది. అయితే ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో మాత్రం మల్టీస్టారర్‌ చిత్రాలు రావడం లేదని చెప్పక తప్పదు. తాజాగా నాగార్జున, నానిల కాంబోలో ఒక మల్టీస్టారర్‌ను శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మించబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే ఆ సినిమా సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. ఇక తాజాగా ఈ చిత్రం  ప్రకటన కూడా రావడంతో తెలుగు ప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.