మరో అపర మేధావి… మహా భారతంలో లైవ్ టేలీకాస్ట్ ఉందన్న బీజేపీ మంత్రి

Dinesh Sharma Controversy comments on Journalism

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తరచూ వివాదాస్పద, అర్ధం లేని వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ నేతలు వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్‌… మహా భారత కాలంలో ఇంటర్నెట్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్ ఉన్నాయని అదే పనిగా అర్ధంలేని వ్యాఖ్యలు చేసి… చేసి… వార్తల్లో హాట్ టాపిక్ గా నిలవటం తెలిసిందే. తర్వాత హనుమంతుడు ప్రపంచంలోనే తొలి ఆదివాసి నాయకుడు అని బీజేపీ రాజస్థాన్‌ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్ అహుజా సెలవిచ్చారు. తాజాగా ఇటువంటి విచిత్ర వ్యాఖ్యలు చేసిన వారి జాబితాలో మరో బీజేపీ నేత చేరారు. సాంకేతికత భారతదేశానికి కొత్త కాదంటూ… పురాతన కాలం నుంచి అవన్నీ అందుబాటులో ఉన్నాయని.. మహాభారతం కాలం నుంచే దేశంలో పాత్రికేయం ఉందంటూ అక్కడ హాజరయిన జనాల మబ్బులు విడిపోయే వ్యాఖ్యలు చేశారు.

జర్నలిజం, ప్రత్యక్ష ప్రసారాలు అనేవి మహాభారత కాలంలోనే ప్రారంభమయ్యాయని ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ వ్యాఖ్యానించారు. ‘హిందీ జర్నలిజం డే’ కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రసంగిస్తూ… సంజయుడు హస్తినాపురంలోనే ఉండి కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం గురించి ఎప్పటికప్పుడు దృతరాష్ట్రుడికి వివరించాడని అన్నారు. మరి ఇది లైవ్ టెలికాస్ట్ కాకపోతే మరేంటని ప్రశ్నించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అంతేనా.. మీ గూగుల్ ఇప్పుడు మొదలైంది. కానీ.. మా గూగుల్ ఎప్పటినుంచో ఉందంటూ నారదుడ్ని తెర మీదకు తెచ్చారు. నారదడు సమాచార గని అని.. ఎక్కడి విషయాన్ని అయినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా చేరవేయగలడని చెప్పుకొచ్చారు.