‘ఊరు పేరు భైరవకోన’ ట్రైలర్ పై లేటెస్ట్ అప్ డేట్

‘ఊరు పేరు భైరవకోన’ ట్రైలర్ పై లేటెస్ట్ అప్ డేట్
Cinema News

యువ నటుడు సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా ఊరు పేరు భైరవకోన. వాస్తవానికి ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం కారణంగా ఫిబ్రవరి 9 కి రిలీజ్ వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే.

విషయం ఏమిటంటే, ఈ సినిమా యొక్క ట్రైలర్ ని రేపు ఉదయం 10 గం. ల నుండి హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో ఈవెంట్ లో భాగంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా తెలియచేసారు .

‘ఊరు పేరు భైరవకోన’ ట్రైలర్  పై లేటెస్ట్ అప్ డేట్
‘Uru Parama Bhairavakona’ Trailer Latest Update….!

కావ్య థాపర్, హర్ష చెముడు, వెన్నెల కిషోర్, ఖుషీ రవి తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంస్థల పై అనిల్ సుంకర గ్రాండ్ గా నిర్మిస్తుండగా శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఊరి పేరు భైరవకోన సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.