ఇండియాను మించిన ఫ్రెండ్ లేదు

US Offers To India For Selling F16 And F18 Fights

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అమెరికాకు ఇన్నాల్టికి సత్యం తెలిసొచ్చింది. ఆసియా పసిఫిక్ రీజియన్లో నమ్మదగ్గ శక్తివంతమైన దేశం భారత్ ఒక్కటేనని ట్రంప్ సర్కారు గుర్తించింది. గతానికి భిన్నంగా పాకిస్థాన్ కు డైరక్ట్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా.. ఇప్పుడు ఇండియాకు రక్షణ విషయంలో సహాయం చేయడానికి ముందుకొచ్చింది. అత్యాధునిక యుద్ధ విమానాలు ఎన్ని కావాలన్నా ఇస్తామని ప్రకటించింది. అంతర్జాతీయ వేదికలపై చైనా అమెరికాకు కొరకారని కొయ్యగా మారడం, మరోవైపు బ్రిక్స్ లాంటి సదస్సులో భారత్ చైనాను నిలువరించడం.. ట్రంప్ ను విశేషంగా ఆకట్టుకుంది. పైగా తన శత్రుదేశమైన రష్యాతో కూడా భారత్ కు సన్నిహిత సంబంధాలుండటం.. భవిష్యత్తులో తనకు మేలు చేస్తోందని అమెరికా భావిస్తోంది. అందుకే అంతర్జాతీయంగా భారత్ శక్తిని దృష్టిలో పెట్టుకుని ఆయుధాల సరఫరాకు ముందుకొచ్చింది. అమెరికాలో తయారయ్యే అత్యంత శక్తివంతమైన ఎఫ్ -16, ఎఫ్-18 విమానాలు విక్రయిస్తామని అమెరికా ఆఫర్ ఇవ్వడం కీలక పరిణామం. గతంలో భారత్ పై ఆంక్షలు విధించిన అమెరికానే.. ఇప్పుడు ఏరికోరి ఆయుధాలిస్తామని ముందుకు రావడం పెరుగుతున్న మన దేశ ప్రాబల్యానికి నిదర్శనం. ఈ విమానాలు మన సైన్యానికి చేరితే.. చైనాతో సమానంగా మనకు శక్తిసామర్థ్యాలు వస్తాయని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

మరో సర్జికల్ స్ట్రైక్స్ కు రెడీ

మోడీని అన్ ఫాలో చేస్తున్న ట్విట్ట‌ర్ యూజ‌ర్లు.