ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా చంపిన మహిళ

ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా చంపిన మహిళ

ఓ మహిళ ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా చంపి, మృతదేహాలను సూట్‌కేస్‌లో కుక్కి కారు డిక్కీలో పెట్టుకొని కొన్ని నెలలపాటు చక్కర్లు కొట్టిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. గతేడాది మేలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివారాలు ఇలా ఉన్నాయి.. బాల్టిమోర్‌లోని ఈస్ట్‌ కోస్ట్‌ నగరానికి చెందిన నికోల్‌ జాన్సన్‌ అనే మహిళ కారులో వెళుతుంటే పోలీసులు ఆపారు. కారు పత్రాలు చూపించకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జాన్సన్‌ను పోలీసులు వివరాలు అడుగుతుంటే.. ‘’మీరేం చేసిన నేను పట్టించుకోను..ఎందుకంటే మరో ఐదు రోజుల్లో నేను మీడియాకు సంచలనంగా మారబోతున్నాను అని చెప్పింది.

మహిళ మాటలపై అనుమానం వచ్చి పోలీసులు ఆ కారును పరిశీలించగా అందులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో జాన్సన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆమెను విచారించగా.. అ మృతదేహాలు తన బంధువు పిల్లలవని చెప్పింది. ఏడేండ్ల మేనకోడలు, అయిదేళ్ల మేనల్లుడిని 2019లో అక్క తనకు అప్పగించిందని పేర్కొంది. మేనకోడలు తలను అనేకమార్లు నేలకేసి కొడితే తన చనిపోయిందని, డెడ్​బాడీని కారులో దాచానని చెప్పింది. అనంతరం బాబును కూడా చంపానని వివరించింది. అయితే, పిల్లలను ఎందుకు చంపిందని కానీ మిగతా వివరాలు కానీ పోలీసులకు వెల్లడించలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.