సైరా నరసింహారెడ్డి.. టైటిల్‌ వివాదం

Uyyalawada family angry on Chiru Sye raa Narasimha reddy Title

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ఇటీవలే లాంచనంగా ప్రారంభం అయ్యింది. నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా టైటిల్‌ లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ చిత్రానికి ‘సైరా నరసింహారెడ్డి’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. అయితే ముందు నుండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్‌ను అనుకున్నారు. అయితే తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రానికి సైరా అనే టైటిల్‌ను పెట్టారు. క్యాప్షన్‌గా నరసింహారెడ్డిని జత చేయడం జరిగింది. అయితే ఈ టైటిల్‌పై ఉయ్యాలవాడ ఫ్యామిలీ ఆగ్రహంగా ఉంది.

తమ కుటుంబ పెద్ద అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నప్పుడే తాము పూర్తి పేరును సినిమా పేరుగా పెడితే ఒప్పుకుంటామని చెప్పాం. కాని ఇప్పుడు ఆ పేరును కాకుండా వేరే పేరును పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉయ్యాలవాడ ఫ్యామిలీకి చెందిన కొందరు ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులతో ఈ విషయమై మాట్లాడినట్లుగా తెలుస్తోంది. వెంటనే టైటిల్‌ను మార్చాల్సిందే అని లేదంటే కోర్టుకు వెళ్తాం అంటూ బెదిరించడం జరిగింది. దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆలోచనల్లో పడ్డట్లుగా విశ్వసనీయంగా సమాచారం అందుతుంది.

మరిన్ని వార్తలు:

బాలయ్య 102లో నయన్‌ షాకింగ్‌ రోల్‌

నెల ముందే పూర్తి చేసిన ఎన్టీఆర్‌

‘అర్జున్‌ రెడ్డి’కి అదే పెద్ద మైనస్‌ అయ్యేలా ఉంది