దేవెగౌడ మీద 22 ఏళ్ల పగ తీర్చుకున్న గవర్నర్ వాజూభాయ్ !

Vajubhai vala takes personal Glitz on Dewagowd in Karnataka politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటకలో అందరూ ఊహించినట్లే జరిగింది. నిన్న మేము అన్నట్టుగానే మోడీ-షా లకి అత్యంత సన్నిహితుడు అయిన వాజూభాయ్ బీజేపీకి పట్టం కట్టేలా వ్యవహరించారు. గోవా, మణిపూర్ లలో పట్టని రూల్స్ ఇక్కడ మాత్రం తూచా తప్పకుండ పాటించి గవర్నర్ తన మోడీ ప్రేమని నిరూపించుకున్నారు. న్యాయ నిపుణులు సహా అందరూ ఇది సరి కాదని వారిస్తున్నా గవర్నర్ మాత్రం ఏకపక్షంగా తన దారిన తాను బీజేపీకి అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే గవర్నర్ ఈ పట్టుదల వెనుక ఒక్క బీజేపీ భక్తి మాత్రమే కాదని మరో బలమైన కారణం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత దేవ‌గౌడ ప్రధాన మంత్రిగా ఉన్నస‌మ‌యంలో తనకు, తన పార్టీకి జరిగిన అన్యాయానికి ఇప్పుడు ప్ర‌తీకారం తీర్చుకున్నారట… ప్రస్తుత కర్ణాటక గవర్నర్ గా ఉన్న వాజూభాయ్ వాలా. దాదాపు 22 సంవత్సరాల క్రితం తనకు మంత్రి పదవిని దూరం చేసిన దేవెగౌడకి ఇప్పుడు ఆయన కొడుకు కుమార‌స్వామికి సీఎం కుర్చీ ద‌క్క‌కుండా చేశారని అంటున్నారు.

ఎందుకంటే మాజీ ప్రధాని దేవెగౌడ నిర్ణయాల వల్ల నష్టపోయిన వారిలో వాజూభాయ్‌ కూడా ఉన్నారు. 1996లో దేవెగౌడ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు… గుజరాత్‌లో సురేశ్‌ మెహతా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పడిపోవడానికి దేవెగౌడనే కారణం అయితే 1985 నుంచి ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు విజయం సాధించిన వాజూభాయ్ వాలాకి, మెహతా ప్రభుత్వంలో తొలిసారిగా మంత్రి పదవి దక్కింది. ఇక ఆ సమయంలో బీజేపీ 121మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే బీజేపీ నుండి తిరుగుబావుటా ఎగుర‌వేసిన శంకర్ సింగ్ వాఘేలా త‌న‌కు ఇత‌ర పార్టీల‌నుండి 40 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉందంటూ కాంగ్రెస్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో గుజరాత్ లో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాల‌ని రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మకు సిఫార్సు చేశారు… దేవెగౌడ. వెంట‌నే రాష్ట్ర‌ప‌తి కూడా సంత‌కం చేయ‌డంతో మంత్రిగా వాజూభాయ్ వాలా పదవిని మూన్నాళ్ల ముచ్చటే అయింది. తర్వాత అప్పటి గవర్నర్ మెజారిటీ సీట్లున్న బీజేపీకి బదులు ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్‌ (వాఘేలా స్థాపించిన పార్టీ) ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.

బీజేపీకే సంఖ్యాబలం ఉన్నా… గవర్నర్‌ ఆర్జేడీకి అవకాశమిచ్చారు. 1997లో వాఘేలా సీఎం పదవి నుంచి తప్పుకొన్నా… ఆర్జేడీ సర్కారు మాత్రం మార్చి 1998 వరకు కొనసాగింది. కానీ ఆ తర్వాతి కాలంలో వజూభాయ్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఎప్పుడూ మంత్రిపదవి మాత్రం దక్కలేదు. 2014లో మోడీ ప్రధాని అయ్యాక ఆయన పుణ్యమా అని కర్ణాటక గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు కర్ణాటకలో ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనేది ఆయన విచక్షణ మీదే ఆధారపడి ఉంది. రాజ్యంగబద్దంగానే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ఆయన అవకాశం కల్పించారు. ఐతే… ఆ నాటి ప్రతీకారేచ్చతోనే తన కుమారుడు కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదని దేవెగౌడ భావిస్తున్నట్లు సమాచారం. అయినా రాజకేయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత మిత్రులు ఉండరని చెబుతుంటారు కానీ అది మాత్రం దేవెగౌడ విషయంలో తప్పయ్యేలా ఉంది.