ఏం వర్మ.. నిజంగా జీఎస్టీ కాపీనా?

Varma-GST-Copy-Of-Jaya-Kuma

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏ చిత్రం చేసినా కూడా అది వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. అయితే ఈసారి కొత్తగా ఒక వ్యక్తి తన కాన్సెప్ట్‌ను వర్మ చోరీ చేశాడని, తాను తీయాలనుకున్న సినిమాను వర్మ తీశాడంటూ మీడియా ముందుకు వచ్చాడు. పి జయకుమార్‌ అనే వ్యక్తి కోర్టులో పిటీషన్‌ వేశాడు. కొన్నాళ్ల క్రితం తాను వర్మకు ఒక కాన్సెప్ట్‌ను పంపించాను. ఆ కాన్సెప్ట్‌ నచ్చిందని సమాధానం ఇచ్చిన వర్మ ఆ తర్వాత ఆ సినిమా గురించి వదిలేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు తాను ఇచ్చిన కాన్సెప్ట్‌తోనే వర్మ ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కించినట్లుగా చెప్పుకొచ్చాడు. వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం కథ నాది అంటూ ఇప్పుడు జయకుమార్‌ కోర్టుకు వెళ్లాడు.

వర్మ తీసిన ప్రతి సినిమాపై కోర్టుకు వెళ్లడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం చాలా సర్వ సాధారణం అయ్యింది. వర్మ ఎంత వివాదాస్పద కాన్సెప్ట్‌ తీసుకున్నా కూడా అది ఆయన సొంతంగా ఆలోచించి చేసేది అంటూ అందరి నమ్మకం. కాని జీఎస్టీ సబ్జెక్ట్‌ మాత్రం వర్మది కాదు అంటూ వస్తున్న వార్తు ఆయన అభిమానులకు మింగుడు పడటం లేదు. వర్మకు ఇలాంటి బుద్ది ఏంటని, ఇలా ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

వర్మ నిజంగానే జయకుమార్‌ కాన్సెప్ట్‌ను చోరీ చేసి ఈ పోర్ట్‌ షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించాడా అంటూ ప్రశ్న ఎదురవుతుంది. అయితే వర్మ సినిమాపై కేసు వేస్తే మంచి పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశ్యంతో జయకుమార్‌ ఈ కేసు వేసి ఉంటాడు అంటూ మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జీఎస్టీకి ఇప్పటికే ఫుల్‌గా పబ్లిసిటీ అంటే ఆ పబ్లిసిటీ మరింత ఎక్కువ అయ్యింది.