మెగా హీరో వ‌రుణ్ తేజ్‌కు యాక్సిడెంట్ !

హీరో వ‌రుణ్ తేజ్‌కు యాక్సిడెంట్ అయింది. వాల్మీకి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగా హీరోకు అనుకోకుండా ప్ర‌మాదం జ‌రిగింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కార్ ప్ర‌మాదానికి గురైంది. వ‌న‌ప‌ర్తి జిల్లా కొత్త‌కోట ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. అక్క‌డ్నుంచి వ‌స్తున్న వ‌రుణ్ తేజ్‌కు యాక్సిడెంట్ కావ‌డంతో అభిమానులు కంగారు ప‌డుతున్నారు. అయితే ఈ ప్ర‌మాదంలో మెగా హీరో చిన్న‌పాటి గాయాల‌తోనే బ‌య‌ట‌ప‌డ్డారు. కార్ ధ్వంసమైనా కూడా హీరోకు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌క్క‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు కుటుంబ స‌భ్యులు, అభిమానులు. అనుకోకుండా జ‌రిగిన ఈ ప్ర‌మాదంతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది మెగా కుటుంబం. ఈ మ‌ధ్యే ఎఫ్2 సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న వ‌రుణ్ తేజ్.. ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.