“అంతరిక్షం” ప్రివ్యూ…!

Varun Tej Antariksham 9000 KMPH Movie Preview

వరుణ్ తేజ్ హీరోగా ఘాజి ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రుపొందిన చిత్రం అంతరిక్షం. వరుణ్ తేజ్ సరసన అదితి హైదరి, లావణ్య త్రిపాటి కథానాయకలుగా నటించారు. తొలి ప్రేమ సినిమా తరువాత వరుణ్ తేజ్ నటిస్తున్నా చిత్రం అంతరిక్షం. తెలుగు లో మొదటి స్పేస్ చిత్రంగా రికార్డును నమోదుచేసుకుంది. ఈ చిత్రం సగభాగం స్పేస్ ను తలపించేలా హై క్వాలిటీ విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ వర్క్ ను ఉపయోగించుకొని సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ స్పేస్ సైంటిస్ట్ గా నటిస్తున్నాడు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం కొన్ని అనివార్య కారణాలవలన స్పేస్ లో జాబు కోల్పోయినా వ్యక్తి గా వరుణ్ తేజ్ కనిపిస్తాడు.

అంతరిక్షం లో జరిగే శత్రు దేశాల స్పేస్ దాడులనుండి ఇండియా ను కాపాడుకోవడానికి వరుణ్ తేజ్ మరల స్పేస్ లో జాయిన్ అవ్వుతడు అక్కడనుండి వరుణ్ ఇండియా ను ఎలా కాపాడుతాడో అనేది తెరపైన చూడాలి. వరుణ్ ఇద్దరి హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నాడు. స్పేస్ నుండి లావణ్య తో లవ్ చేసే సీన్ సినిమా కు మంచి ప్లస్ అవ్వుతుంది అంటున్నారు. ఇకా ఈ చిత్రంలో మరో పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటిస్తున్నారు. అవసరాల మరియు వరుణ్ తేజ్ మద్యలో వచ్చే కామెడీ సిన్స్ కానీ ఇంటరెస్టింగ్ స్పేస్ డిస్కషన్ కానీ సినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. అంతరిక్షం చిత్రంలో శ్రీహరి కోటనుండి స్పేస్ లోకి రాకెట్ పంపించే విధానం ఆకట్టుకునే విధంగా హై గ్రాఫిక్స్ వర్క్ తో డిజైన్ చేశారు. ఫస్ట్ ఫ్రేమ్ ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ ఈ చిత్రాని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం రేపు అంటే డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానున్నది.