“పడి పడి లేచె మనసు” ప్రివ్యూ…!

Padi Padi Leche Manasu Movie Preview

శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరొయిన్ గా నటించిన చిత్రం పడి పడి లేచే మనసు. ఈ చిత్రాని హను రాఘవాపుడి దర్శకత్వం వహించారు. శర్వ మరో డిఫరెంట్ లవ్ స్టొరీతో మన ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం నుండి ఇటివల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్సు వచ్చింది. ట్రైలర్ లో చూపించిన విధంగా శర్వ, సాయి పల్లవి ని దూరం నుండి లవ్ చేస్తుంటాడు అది గమనించిన సాయి పల్లవి శర్వానంద్ దగ్గరకు వచ్చి ఏంటి లవ్ చేస్తునవని అడిగి శర్వ ను డిస్టర్బ్ చేస్తుంది. అప్పటి నుండి శర్వ సాయి పల్లవిని పడేసే ప్లాన్ లో ఉంటాడు. హను రాఘవ పూడి మంచి రొమాంటిక్ లవ్ స్టొరీ గా ఈ చిత్రాని రూపొందించాడని ట్రైలర్ అండ్ టిజర్ ను చూస్తే తెలుస్తుంది. అలాగే ఈ చిత్రంలో శర్వాను మరో కోణంలో చూపించాడు. లవ్ ఫెయిల్ అయినా వ్యక్తిగా శర్వ కనిపిస్తున్నాడు. మిగతాది మాత్రం తెరపైన చూడాలి అనే విధంగా ట్రైలర్ ను కట్ చేశారు.

హను ఇంతకు ముందు అందాల రాక్షసి, లై, సినిమాలో చూపించిన విధంగా సస్పెన్స్ తో కూడిన లవ్ స్టోరీని రూపొందించినట్లు తెలుస్తుంది. సాయి పల్లవి కూడా తన నటనతో ఆకట్టుకునే విధంగా నటించింది. శర్వ కు లవ్ స్టోరీస్ చెయ్యడం అంటే వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. ఆల్రెడీ మలి మలి ఇది రాని రోజు, మహానుభావుడు,రన్ రాజా రన్ వంటి చిత్రాలు లవ్ తో కూడిన చిత్రాలు కావునా శర్వ కు పడి పడి లేచే మనసు లో తన నటనతో ఆకట్టుకున్నాడు. అంతరిక్షం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 19 కోట్లు చేస్తే పడి పడి లేచే మనసు 26 కోట్లు చేసింది. ఈ చిత్రం ఇటివల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని శిల్ప కల వేదికలో జరుపుకుంది. ముఖ్య అతిదిగా అల్లు అర్జున అటెండ్ అయ్యాడు. ఈ చిత్రం ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.