మెగా హీరో అంతరిక్ష ప్రయాణం వాయిదా…?

Varun Tej Antariksham 9000kmph Movie Release Postponed

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరో గా నటిస్తున్నా చిత్రం అంతరిక్షం 9000kmph. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ స్పేస్ సైంటిస్ట్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం నుండి ఇటివల విడుదలైన టిజర్ అండ్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్సు వచ్చింది. ఈ చిత్రంను డిసెంబర్ 21 న విడుదల చేస్తాం అని చిత్ర బృందం ప్రకటించింది కానీ. అనుకున్నా సమయంలో ఈ చిత్రం విడుదల కాకపోవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ చిత్రానికి భారీగా గ్రాఫిక్స్ అండ్ vfx అవసరం ఉన్నదట, సినిమాలో మరింత క్వాలిటిని తీసుకువచ్చేందుకు గ్రాఫిక్స్ అవసరం చాలా అవసరం కావున చిత్ర నిర్మాతలు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు.

Antariksham-9000kmph-Movie

వరుణ్ తేజ్ ఈ చిత్రం స్పేస్ సైంటిస్ట్ గా కనిపిస్తాడు. స్పేస్ నుండి పొంచి ఉన్నా ముప్పు నుండి జాతిని ఎలా కాపాడుతాడు అనేది కథాంశం. స్పేస్ లో వరుణ్ తేజ్ పైన వచ్చే సిన్స్ ఒళ్ళు గగ్గురుపుడిచేలగా ఉంటాయి. అంతరిక్షంలో వరుణ్ తేజ్ సిగ్నల్ తప్పిపోయి స్పేస్ షిప్ నుండి దూరం అవుతాడు. ఈ టైం లో వచ్చే సిన్స్ అందరిని ఆకటుకుంటాయి అంటున్నారు. అందుకే వీటికి వీఎఫ్ఎక్ష్ పనితనం ఎక్కువగా ఉంటుంది. స్పేస్ నుండే వరుణ్ తేజ్ భూమి మీద ఉన్న లావణ్య త్రిపాటి ని లవ్ చేసే సిన్స్ సంకల్ప్ రెడ్డి అద్బుతంగా తెరకెక్కించాడు అంటున్నారు. ఘాజి సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నా సంకల్ప్ రెడ్డి ఆ చిత్రానికి కూడా ఎంతో వైవిధ్యంగా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు విడుదలయ్యేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Varun-Tej-Antariksham-9000k